Prabhas:రూ.900 కోట్ల క్లబ్‌లో కల్కి

9
- Advertisement -

బాక్సాఫీస్‌ పై వసూళ్ల సునామీ సృష్టించారు ప్రభాస్. తాజాగా కల్కితో వెయ్యి కోట్ల మార్క్‌కు మరోసారి చేరువయ్యారు డార్లింగ్. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగిస్తోంది. ఇప్పటివరకు రూ.900 కోట్ల వసూళ్లను రాబట్టింది.

ప్రభాస్‌ హీరోగా నాగ్‌అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రూ.1000 కోట్ల దిశ‌గా దూసుకుపోతున్న‌ట్లు చిత్రబృందం ప్ర‌క‌టించింది. ఇక ప్రభాస్ సలార్‌ తర్వాత కల్కితో బ్యాక్ టూ బ్యాక్‌ హిట్ కొట్టారు.

హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్‌, విజువ‌ల్స్ చూసి, తెలుగు సినిమా స్థాయిని ప్ర‌శంసిస్తున్నారు. పేరున్న నటులు భాగస్వాములు కావడం,పాన్ ఇండియా రేంజ్‌కు తగ్గట్టుగా సినిమా ఉండటంతో కల్కి ప్రభంజనం మరిన్ని రోజులు కొనసాగేలా కనిపిస్తోంది.

- Advertisement -