Prabhas:పెళ్లి గురించా?,మూవీ గురించా?

16
- Advertisement -

టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌లో ఒకరు ప్రభాస్. ఈ హీరో పెళ్లి గురించి ఫ్యాన్సే కాదు సౌత్ ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఒక్క పోస్ట్‌తో సెన్సేషన్‌గా మారారు.

మొత్తానికి ఓ ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తి మ‌న‌ జీవితంలోకి రాబోతున్నారు వెయిట్ చేయండి డార్లింగ్స్ అంటూ ప్రభాస్ పోస్ట్ చేయగా క్షణాల్లో వైరల్‌గా మారింది. ఇది ఖచ్చితంగా పెళ్లి గురించేనని కొంతమంది, కాదు కల్కి మూవీ గురించిన వార్త అని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా ఫ్యాన్స్‌లో గందరగోళానికి కేరాఫ్‌గా మారిన ఈ పోస్టుకు ప్రభాస్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో వేచిచూడాలి.

Also Read:మహారాష్ట్రలో కూటమివే 35 స్థానాలు!

- Advertisement -