Prabhas:మంచి మనసు చాటుకున్న ప్రభాస్

18
- Advertisement -

చిత్ర పరిశ్రమలో ఏ మంచి కార్యక్రమం జరిగినా అందులో తానూ భాగమవుతుంటారు రెబెల్ స్టార్ ప్రభాస్. అందరి కంటే ముందుగా స్పందిస్తూ తన వంతు ఆర్థిక సహాయం అందిస్తుంటారు ప్రభాస్. మే 4న హైదరాబాద్ ఎల్బీ స్డేడియంలో డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్న తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ కు ప్రభాస్ 35 లక్షల రూపాయల విరాళం అందించారు. దర్శకుల సంఘం సంక్షేమ నిధి కోసం ఈ డబ్బును వెచ్చించనున్నారు.

నిన్న తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ నిర్వహించిన డైరెక్టర్స్ డే ఈవెంట్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు మారుతి ఈ విషయాన్ని సంఘ సభ్యులకు తెలియజేశారు. 35 లక్షల రూపాయల విరాళం అందించిన ప్రభాస్ కు డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యులు చప్పట్లతో తమ కృతజ్ఞతలు తెలిపారు. అందరి సపోర్ట్ తో డైరెక్టర్స్ అసోసియేషన్ మరింత స్ట్రాంగ్ అసోసియేషన్ కావాలని డైరెక్టర్ మారుతి ఈ సందర్భంగా కోరారు. ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో రాజా సాబ్ సినిమా తెరకెక్కుతోంది.

Also Read:KTR:రుణమాఫీ ఎప్పుడు చేస్తారు?

- Advertisement -