అమరేంద్ర బాహుబలి…

226
Online News Portal
Prabhas first look
- Advertisement -

భారతీయ చలన చిత్ర చరిత్రలో దేశీయంగా అత్యధిక వసూళ్ళు సాధించిన బాహుబలి చిత్రంతో అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించిన ప్రభాస్‌.. బాహుబలి 2లో తన లుక్ ఎలా ఉండబోతుందో రివీల్ చేశాడు. తన పుట్టిన రోజు సంధర్బంగా ప్రభాస్.. అమరేంద్ర బాహుబలి వస్తున్నాడు అంటూ తన ఫస్ట్‌ లుక్‌ను ట్విటర్లో పోస్ట్ చేశాడు. సంకెళ్లతో ఉన్న అమరేంద్ర బాహుబలిని ఈ లుక్‌లో చూపించారు.

ప్రస్తుతం ‘బాహుబలి: ద కన్‌క్లూజన్‌’ సిద్ధమవుతోంది.‘బాహుబలి: ద కన్‌క్లూజన్‌’ వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలిభాగాన్ని మరిపించేలా రెండో భాగం ఉంటుందని ఇటీవల రానా చెప్పిన సంగతి తెలిసిందే. అందుకు తగినట్లు చిత్ర బృందం రెండో భాగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఈ నేపథ్యంలో బాహుబలి-2 ప్రభాస్‌ ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

bahubali2

జియో మామీ 18వ ముంబయి ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో బాహుబలి వర్చువల్‌ రియాల్టీ(వీఆర్‌) టీజర్‌ను విడుదల చేశారు. పలువురు అభిమానులు వీఆర్‌ హెడ్‌సెట్‌లు పెట్టుకుని ‘బాహుబలి వీఆర్‌ టీజర్‌’ అనుభూతిని ఆస్వాదించారు. టీజర్‌ అద్భుతంగా ఉందంటూ కితాబిచ్చారు.

Tamannah

- Advertisement -