సంతోషంలో ‘ప్రభాస్’ ఫ్యాన్స్ !

46
- Advertisement -

సలార్, మారుతి సినిమాల తర్వాత ప్రభాస్ ఎవరితో సినిమా చేయబోతున్నాడు? అంటే, ఇప్పుడో తోపు డైరెక్టర్ పేరు వినిపిస్తోంది. డిసెంబర్ 22న తన సలార్‌తో తలపడనున్న డుంకీ సినిమా డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీతో రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా చేయబోతున్నాడనే న్యూస్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. సలార్‌తో పోటీపడి డుంకీ నెగ్గుతుందో? లేదో? తెలియదు గానీ.. రాజ్ కుమార్ మార్క్ ఫిల్మ్ మాత్రం ఇండియన్ సినిమా హిస్టరీలో నిలిచిపోతుంది. అలాగే సలార్ పై భారీ అంచనాలు ఉన్నాయి. బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది అనే నమ్మకం ఉంది.

కాబట్టి, డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ తో రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా చేస్తే ఆ కిక్కే వేరు. తాజాగా ముంబైలో రాజ్ కుమార్ హిరాణీని కలిసాడని టాక్. ప్రభాస్ – రాజ్ కుమార్ ఇద్దరి మధ్య కథా చర్చలు జరిగాయనేది బాలీవుడ్ వర్గాల మాట. రాజ్ కుమార్, ప్రభాస్ కు స్క్రిప్ట్ నేరేట్ చేశాడని.. కుదిరితే ఈ క్రేజీ కాంబో సెట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే.. ఈ కాంబినేషన్ అనౌన్స్మెంట్‌ తోనే సెన్సేషన్‌ క్రియేట్ చేయడం గ్యారెంటీ. కానీ రాజ్ కుమార్ హిరాణీ చాలా స్లోగా సినిమాలు చేస్తాడు. సో.. ప్రభాస్ తో చేయబోయే సినిమా కూడా ఇప్పట్లో రాకపోవచ్చు.

రాజ్ కుమార్ హిరాణీ – ప్రభాస్ సినిమాకి మరో మూడేళ్ళ సమయం పట్టొచ్చు. రాజ్ కుమార్ హిరాణీ అంత స్లోగా సినిమాలు చేస్తాడు. తన ఇరవై ఏళ్ల కెరీర్లో రాజ్ కుమార్ హిరాణీ కేవలం ఐదు సినిమాలు మాత్రమే చేశాడంటే.. ఆయన ఎంత స్లోనో అర్థం చేసుకోవచ్చు. కానీ, రాజ్ కుమార్ హిరాణీ సినిమా అంటే హిట్ గ్యారెంటీ అని టాక్ ఉంది. ఏది ఏమైనా ఈ సినిమా కనుక ఓకే అయితే బాలీవుడ్ లో ప్రభాస్ గెలుపు జెండా ఎగురవేయడం ఖాయమని తెలుస్తోంది. ఈ వార్త విన్న ప్రభాస్ ఫ్యాన్స్.. అంటే అన్నారు కానీ, ఆ ఊహ ఎంత బావుందో.. ? .. ఇదే నిజమవ్వాలని కోరుకుంటున్నాం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Also Read:Bandi:పాపం బండి.. ఈసారి కూడా డౌటే?

- Advertisement -