ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్…ఏం చేశాడో తెలుసా?

429
Sahoo Prabhas Cubic
- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి మూవీ దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం సాహో. ఈసినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. సాహో టీజర్ , ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈనెల 30న ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా విడుదల కానుంది. సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈచిత్రం తెలుగు, తమిళ, మలయాళం, హీందీ భాషల్లో విడుదల కానుంది.

తాజాగా ఈసినిమా సెన్సార్ ను కూడా పూర్తి చేసుకుంది. ఇక ప్రభాస్ పై తమకున్న అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక విధంగా చూపించుకుంటున్నారు. ఒరిస్సాకి చెందిన ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్ తనదైన శైలిలో అభిమానాన్ని చాటుకున్నారు. 486 రూబిక్ క్యూబ్స్‌తో 13 గంట‌ల పాటు శ్ర‌మించి ప్ర‌భాస్ ముఖ చిత్రాన్ని త‌యారు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఇది చూసిన ప్రభాస్ అభిమానులు అతన్ని ఆకాశానికెత్తుతున్నారు.

.https://twitter.com/Rahul_Prabhas_/status/1165535011652558848

- Advertisement -