త్వరలో ప్రభాస్‌ ఛానల్..!

452
prabhas Entertainment channel
- Advertisement -

బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలను లైన్లో పెట్టిన ప్రభాస్‌ త్వరలో బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

గ‌తంలో నాగార్జున ,చిరు మా టీవీ చానల్‌లో భాగస్వామిగా ఉన్నారు. వీరిబాటలోనే నడవనున్నాడు ప్రభాస్‌. ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్‌లో భాగ‌స్వామి అయ్యేందుకు ప్రభాస్ ఉత్సాహం చూపిస్తున్నట్లు సన్నిహితవర్గాల సమాచారం.

ప్ర‌భాస్ స్నేహితులు వంశీ కృష్ణా రెడ్డి, ఉప్ప‌ల‌పాటి ప్ర‌మోద్‌లు త్వ‌ర‌లో ఓ టీవీ ఛానెల్ ప్రారంభించ‌నున్నారు. ఇందులో ప్రభాస్‌ కూడా పార్ట్‌నర్‌ షిప్‌ పెట్టబోతున్నారట. అయితే అఫిషియల్‌గా అనౌన్స్‌మెంట్ రావాల్సిఉంది.

హీరోలు వ్యాపారరంగంలో దిగడం కొత్తేమీ కాదు. రామ్ చరణ్‌..ట్రూ జెట్‌ ఎయిర్‌వేస్‌,చిరు..నాగార్జున కలిసి కేరళలో ఓ పోల్ టీమ్‌ కొనుగోలు చేశారు. ఇక సూపర్ స్టార్ మహేష్ ఏఎమ్‌బీ పేరుతో మల్టిప్లెక్స్ బిజినెస్‌లోకి అడుగుపెట్టగా బన్నీ కూడా త్వరలోనే ఓ మల్టిప్లెక్ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ప్రభాస్ సైతం ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్‌ ప్రారంభించనున్నాడనే వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

- Advertisement -