ఏకైక హీరోగా ప్రభాస్ సరికొత్త రికార్డు

28
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్ పార్ట్ 1’ భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. పైగా ‘సలార్’ మూవీకి మన దేశంలో కాకుండా అమెరికాలోనూ సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఓన్లీ ప్రీమియర్స్ ద్వారా ఈ సినిమా 2.60 అమెరికన్ మిలియన్ డాలర్స్ కొల్లగొట్టగా.. ఈ సినిమా నిన్నటితో $6.3 యూఎస్ డాలర్స్ గ్రాస్‌ ను క్రాస్ చేసింది. దీంతో బాహుబలి, బాహుబలి 2 తర్వాత సలార్ సినిమాతో మూడు సార్లు అక్కడ 5 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్షన్లు సాధించిన ఏకైక సౌతిండియా స్టార్‌గా ప్రభాస్ రికార్డులకెక్కాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

నిజానికి ఇలాంటి రికార్డులు సాధించిన ఏకైక హీరోగా.. ప్రభాస్ పేరిట చాలా రికార్డ్స్ ఉన్నాయి. అంతెందుకు.. ? నైజాంలో ‘సలార్’ తో ప్రభాస్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఈనెల 22న విడుదలై ఈ సినిమా ఇప్పటివరకు నైజాం ఏరియాలో రూ.50 కోట్ల షేర్ మార్కును అందుకుంది. దీంతో టాలీవుడ్ చరిత్రలోనే నైజాంలో రూ.50 కోట్ల మార్కు అందుకున్న మూడో సినిమాగా సలార్ రికార్డు సృష్టించింది. ఇంతకముందు RRR (రూ.111.85కోట్లు), బాహుబలి-2(రూ.68కోట్లు) షేర్‌ను అందుకున్నాయి. ఈ రెండు సినిమాల్లో కూడా ఒక సినిమాలో ప్రభాసే హీరో. అంటే.. నైజాంలో కూడా ప్రభాసే ముందంజలో ఉన్నాడు.

మొత్తానికి పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ తన స్థాయి ఏమిటో మరోసారి గ్రాండ్ గా చెప్పినట్టు అయ్యింది. మొత్తమ్మీద సలార్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. అన్నట్టు తాజాగా సలార్ ఓటిటి రిలీజ్ పై రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధర ఇచ్చి సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం ఫిబ్రవరి మొదటి వారంలో అయితే స్ట్రీమింగ్ కి వచ్చే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది.

Also Read:కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు:సీఎం రేవంత్

- Advertisement -