ప్రభాస్‌ చేతిలో రావణ దహనం @రామ్‌లీలా

150
- Advertisement -

లవకుశ రామ్‌లీలా కమిటీ ఈసారి విజయదశమి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. గడిచిన రెండేళ్ల కాలంలో కరోనా వల్ల ఉత్సవాలను నిర్వహించలేకపోయిన నిర్వహకులు…ఈ సారి భారీ ఎత్తున్న ప్రణాళికలు రచించింది. విజయదశమి పండుగను పురస్కరించుకొని ఎర్రకోటలో అయోద్యలోని రామాలయం నిర్మాణంలోని పండల్‌ను వేదికగా తీర్చిదిద్దారు.

రావణ దహన కార్యక్రమానికి పాన్ ఇండియా హీరో ప్రభాస్ పాల్గొననున్నారు. ఈయనతో పాటుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో రావాణసురుడు, కుంభకర్ణుడు, మేఘనాధ్‌ల బొమ్మలను ప్రభాస్‌ దహనం చేయనున్నారు.

ప్రభాస్ పాన్ ఇండియా సినిమా అదిపురుష్ లో రాముడిగా నటిస్తున్నాడు. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుండగా.. సైఫ్‌ అలీ ఖాన్ రావణ పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవలే ఈ సినిమా టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు.

- Advertisement -