బాహుబలి సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. రన్ రాజా రన్ చిత్ర దర్శకుడు సుజీత్ ఈసినిమాకు దర్శకత్వం వహిస్తుండగా త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా శ్రద్దా కపూర్ నటిస్తున్నారు. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై సుజిత్ నిర్మిస్తున్నారు.
బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమా ఒక్కటి విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో సాహోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే రాధాకృష్ణ దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయ్యారు ప్రభాస్. యంగ్ రెబల్ స్టార్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు డబుల్ ట్రీట్ అందనుంది.
ప్రభాస్ బర్త్‌డే అక్టోబర్ 23 కాగా, ఒక్క రోజు ముందే అంటే 22న సాహో చిత్ర టీజర్‌తో పాటు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న చిత్ర ఫస్ట్ లుక్, టైటిల్ రివీల్ చేయనున్నట్టు తెలుస్తుంది. రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న మూవీకి అమూర్ అనే ఫ్రెంచ్ టైటిట్‌తో పాటు జాన్ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారట. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ యూరప్‌లో జరుగుతుంది.