ఒక్క సినిమాతో..మూడు పెళ్లిళ్లు

206
Prabhas
- Advertisement -

తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన సినిమా బాహుబలి. దర్శకధీరుడు జక్కన్న తెరకెక్కిస్తున్నబాహుబలి పార్ట్‌ 2 చిత్రీకరణ కూడా చివరి దశకు చేరుకుంది. మార్చిలో సినిమాను రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదిరిచూస్తున్నారో..వారి పెళ్లి విషయంపై కూడా అంతే క్యూరియాసిటీతో ఉన్నారు.  అవును బాహుబలి పార్ట్‌ 2 సినిమా తర్వాత ఇందులో కీలకపాత్ర పోషిస్తున్న ముగ్గురు తారల పెళ్లి పై ఓ క్లారిటీ రానుంది.

Prabhas

బాహుబలిగా దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ పెళ్లి గురించి ఇండస్ట్ర్రీలో చాలా రోజులుగా చర్చ జరుగుతూనే. ప్రభాస్ మాత్రం బాహుబలి పార్ట్ 2 తర్వాత పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నాడట. బాహుబలి తరువాత ప్రభాస్‌ ఓ ఇంటి వాడవుతాడంటూ స్వయంగా ప్రభాస్ పెదనాన్న, కృష్ణంరాజు ప్రకటించటంతో.. ఈ సినిమా తరువాత ప్రభాస్ పెళ్లి పీటలెక్కటం కాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే పెదనాన్న కృష్ణంరాజు ప్రభాస్‌కు పెళ్లి కూతుర్ని వెతికే పనిలో ఉన్నాడట. అదే సమయంలో హీరోయిన్ అనుష్క పెళ్లిపై కూడా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

Prabhas

బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారవేత్తతో ప్రేమలో ఉన్న స్వీటి, త్వరలోనే అతనితో ఏడడుగులు నడిచేందుకు ప్లాన్ చేసుకుంటుందట. అయితే అనుష్క పెళ్లి కూడా బాహుబలి రిలీజ్ తరవాతే అంటున్నారు. ఇక టాలీవుడ్ హంక్ రానా పెళ్లి కూడా త్వరలోనే జరగొచ్చన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి పెళ్లి ప్రస్తావన లేకపోయినా.. సీనియర్ హీరోయిన్లతో ఎఫైర్లంటూ రానాపై చాలానే రూమర్లు ఉన్నాయి. దీనికి తోడు ఇప్పటికే మూడుపదుల మార్క్ దాటిన రానా పెళ్లిపై కుటుంబ సభ్యులు తొందర పడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. అందుకే ఈ ఒక్క సినిమా రిలీజ్ తరువాతే ఈ ముగ్గురు స్టార్ల జీవితాలు మలుపు తిరగనున్నాయి.

- Advertisement -