ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకుంటారా?

216
- Advertisement -

నిజ జీవితంలో అమరేంద్ర బాహుబలి,దేవసేన ఒక్కటవుతారా? ప్రభాస్, అనుష్క మనుసులో ఏముందో కాని,టీ టౌన్ సర్కిళ్లో మాత్రం అవుననే మాట వినిపిస్తోంది. వ్యక్తిత్వంతో పాటు హైట్, పర్సనాలిటీ ఇలా అన్ని విషయాలల్లో ప్రభాస్, అనుష్క జోడి మేడ్ ఫర్ ఇచ్ అదర్ గా ఉంటుంది. తాజగా బాహుబలి ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా ఈ ఇద్దరిని చూసిన చాలా మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.ట్విట్టర్ ఫోటోలు, ప్రమోషన్లలో మ్యాచింగ్ కలర్ డ్రస్ తో ప్రభాస్, అనుష్క పక్కపక్కనే నిలబడి ఫోజివ్వడం.. ఇలా చాలా విషయాలను కంపేర్ చేస్తే.. త్వరలో వీరిద్దరూ వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యే అవకాశం లేకపోలేదని సినీ జనం అనుకుంటున్నారు.

tumblr

ఇక సుధీర్ఘంగా సాగుతున్న బాహుబలి మూవీ జర్నీలో ఈ ఇద్దరు బాగానే క్లోజ్ అయ్యారనే టాక్ ఉంది. బాహుబలి తరువాత ప్రభాస్ కు, ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు పూర్తయ్యాక అనుష్కకు పెళ్లి చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు డిసైడ్ అయ్యారు. ఈనేపధ్యంలో ప్రభాస్, అనుష్క పెళ్లిపై పుకార్లు మరింత పెరగిపోయాయి. వారిని అభిమానించే సినీ ప్రేమికులు మాత్రం ఈ ఇద్దరిని జంటగా చూడాలని ఆశపడుతున్నారు. అయితే జరిగేది ఏంటన్నది తెలియాలంటే మాత్రం వచ్చే ఏడాది ద్వితీయార్థం వరకు వెయిట్ చెయ్యక తప్పదు.

- Advertisement -