ప్రభాస్‌, జక్కన్న కాంబినేషన్‌లో మరో మూవీ..?

151
- Advertisement -

ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ఛత్రపతి, బాహుబలి-1, బాహుబలి 2 సినిమాలు ఏ స్థాయిలో ఘన విజయాన్ని సాధించాయో వేరే చెప్పనక్కర్లేదు. ఛత్రపతి చిత్రంతో ప్రభాస్ మాస్ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.

అలాగే బాహుబలి – 1,2 లతో ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు ప్రభాస్‌. దాంతో జక్కన్న,రాజమౌళి కాంబినేషన్‌ ఉన్న క్రేజ్ అమాంతంగా పెరిగిందనే చెప్పాలి.

 Prabhas and Rajamouli Combination Going to Repeat Again

తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజమౌళిని “మళ్ళీ ప్రభాస్ తో ఎప్పుడు కలిసి పనిచేస్తారు..?” అని విలేఖరి అడగగా.. రాజమౌళి స్పందిస్తూ “బాహుబలి చిత్రం కోసం ప్రభాస్ తో ఏకంగా ఐదు సంవత్సరాల పాటు కలిసి పనిచేశాను. ఇప్పుడు మా ఇద్దరికీ కాస్త విరామం కావాలి. భవిష్యత్తులో ప్రభాస్ తో కచ్చితంగా మరో చిత్రం చేస్తాను.” అని అన్నారు.  సో..వీరి  కాంబినేషన్ లో మరో  మూవీ రానుందన్నమాట.

ఇక ఈ వార్త ప్రభాస్ , రాజమౌళి అభిమానులకు ఈ వార్త పండగే అని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే..ప్రభాస్ తాజాగా సుజిత్ దర్శకత్వంలో ‘సాహూ’ చేస్తుండగా.. రాజమౌళి ఎన్టీఆర్ -రామ్ చరణ్ కలయికలో మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు.

- Advertisement -