సైలెంట్ గా ఉందని కెలికితే..అంటున్న బాలయ్య..!

204
Balakrishna's Jai Simha teaser to be released
- Advertisement -

ఫుల్ మాస్ యాక్షన్ తో బాలయ్య మరోసారి నట విశ్వరూపం చూపించారు. గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత స్పీడు పెంచిన బాలయ్య జై సింహా రెడీ ఆడియెన్స్‌ముందుకొస్తున్నాడు. ఈ క్రమంలోనే ‘జై సింహా ‘టీజర్ ను నేడు (గురువారం) విడుదల చేసింది చిత్రటీమ్‌. యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసిన కొంత సమయానికి భారీ సంఖ్యలో వ్యూస్, లైక్స్ తో జై సింహా టీజర్ దూసుకుపోతోంది. అలాగే..బాల‌య్య చేస్తోన్న ఫైట్స్‌ అదుర్స్ అనిపిస్తున్నాయి. బాలయ్య మాస్‌లుక్‌తో పాటు స్టైలిష్ లుక్‌తోనూ క‌న‌ప‌డుతున్నాడు.

‘సింహం మౌనాన్ని సన్యాసం అనుకోవద్దు. సైలెంట్ గా ఉందని కెలికితే తల కొరికేస్తదంటూ’ బాలకృష్ణ చెప్పిన మాస్ డైలాగ్ అందర్నీ ఆకట్టుకుంటోంది. 30 సెకన్ల పాటు ఉన్న ఈ టీజర్ లో బాలయ్య నటనతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.

తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. బాలయ్య సరసన నయనతార, నాటాషా జోషి, హరిప్రియలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను 2018 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -