ప్రభాస్ ను ఇబ్బంది పెట్టిన బాలయ్య

1973
- Advertisement -

బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 2 లో ప్రభాస్ గెస్ట్ గా వస్తున్నాడనే న్యూస్ బయటికి వచ్చినప్పటి నుండి ఈ ఎపిసోడ్ కోసం అందరూ వెయిట్ చేశారు. షూటింగ్ టైమ్ లో లీకైన ఫోటోస్ , వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే అందరూ ఎదురుచూసిన ప్రభాస్ ఎపిసోడ్ నిన్న ఆహాలో స్ట్రీమింగ్ అయింది. ముందుగా 30 న అనుకోని ఒక రోజు ముందే వదిలేశారు.

డార్లింగ్ ఫ్యాన్స్ తో పాటు వరల్డ్ వైడ్ గా అందరూ నిన్న ఒక్కసారిగా ఆహా ఓపెన్ చేయడంతో యాప్ క్రాష్ అయింది. ఎంతసేపటికి యాప్ ఓపెన్ అవ్వలేదు. ఏదేమైనా డార్లింగ్ ఫ్యాన్స్ తో పాటు అందరినీ ఈ ఎపిసోడ్ అలరించింది. ముఖ్యంగా బాలయ్య ముందు ప్రభాస్ వినయంగా చేతులు కట్టుకొని కూర్చోవడం ప్రతీ దానికి సార్ , సార్ అనడం ప్రభాస్ లో ఉన్న గొప్ప గుణాన్ని బయట పెట్టింది.

ఎపిసోడ్ లో బాలయ్య ప్రభాస్ ను పెళ్లి చేసుకోబోయే మేడమ్ ఎవరని గట్టిగా అడిగాడు . కృతి సనన్ విషయం కూడా నేరుగా అడిగేశాడు . దీంతో ప్రభాస్ కాసేపు ఇబ్బంది పడ్డాడు. కృతి మేడమ్ చెప్పేసింది కదా ఏమి లేదని , మేము ఏం చేయకుండానే వార్తలు వచ్చేస్తున్నాయి అంటూ మేటర్ దాటేశాడు. ఇక బాలయ్య కూడా మేడమ్ విషయం చెప్పమని పదే పదే అడగసాగాడు. మధ్యలో రామ్ చరణ్ ను ఫోన్ లైన్ లోకి తీసుకొని మరి ప్రభాస్ ప్రేమ విషయం చెప్పమని అడిగాడు బాలయ్య. త్వరలోనే ప్రభాస్ గుడ్ న్యూస్ చెప్తాడని చరణ్ అనడంతో ప్రభాస్ కాసేపు ఆ మేటర్ ఏమిటని తనకి తెలియదని నవ్వుతూ క్లారిటీ ఇచ్చాడు. ఏదేమైనా అన్ స్టాపబుల్ ప్రభాస్ ఎపిసోడ్ లో ఎక్కువగా రెబల్ స్టార్ పెళ్లి గురించే బాలయ్య డిస్కషన్ పెట్టాడు. పైగా ఓ సందర్భంలో శెట్టి నా సనన్ నా ? అంటూ ఆటపట్టించాడు. ప్రభాస్ పెళ్లి మేటర్ తో ప్రేక్షకులను అన్ స్టాపబుల్ మంచి వినోదం అందించింది.

ఇవి కూడా చదవండి…

బాహుబలి దెబ్బకి ఆహా క్రాష్‌..

విమర్శల వలయంలో పఠాన్

పిక్ టాక్ : బికినీలో అందాల అరాచకం

- Advertisement -