ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్

344
pabhas
- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జిల్ మూవీ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్నాడు. ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే సగం వరకు షూటింగ్ ను పూర్తి చేసుకుంది. గ‌త కొద్ది రోజులుగా జార్జియాలో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు దర్శకుడు రాధాకృష్ణ. ప్రభాస్ 20వ మూవీ ఫస్ట్ లుక్ త్వరలోనే వస్దుంది అంటూ ట్వీట్ చేశాడు దర్శకుడు. ఉగాది పండుగకు ఈమూవీ ఫస్ట్ లుక్ లేదా టైటిల్ ను విడుదల చేయనున్నట్లు సమచారం. రొమాంటిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

- Advertisement -