పవన్‌ కి అదే కావాలట..ఇది ఫిక్స్‌..

196
- Advertisement -

త్రివిక్రమ్ డైరెక్షన్‌లో పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న నయా మూవీలోనూ పవన్ మార్కు ఫోక్ సాంగ్ ఒకటి ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం ట్యూన్ కూడా సిద్ధమైపోయిందట. తన సినిమాల్లో తనదైన మార్కు చూపించడానికి ప్రయత్నించే పవన్.. అందుకోసం ఎక్కువగా ఫోక్ సాంగ్స్‌ను ఆశ్రయిస్తుంటాడనే టాక్ ఉంది.

అయితే పవన్ కెరీర్ తొలినాళ్లలో వచ్చిన తమ్ముడు సినిమా మొదలుకుని.. కొద్ది వారాల క్రితం ఆడియెన్స్ ముందుకు వచ్చిన కాటమరాయుడు వరకు తనకు నచ్చిన ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతూ వచ్చాడు పవర్ స్టార్. ఫోక్ సాంగ్ ప్రేక్షకులకు నచ్చినా నచ్చకపోయినా వీటిని ఎంకరేజ్ చేసే విషయంలో పవన్ ఎప్పుడు ముందుంటాడనేది ఇండస్ట్రీ వర్గాలు టాక్‌.
 folk song in pawan-trivikram film
పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన గత చిత్రం ‘అత్తారింటికి దారేది’లో కాటమరాయుడా అనే ఫోక్ సాంగ్ అప్పట్లో ఆడియెన్స్‌ను బాగా ఎంటర్ టైన్ చేసింది. ఆ మాటకొస్తే.. ఆ సినిమా టైటిల్ పవన్‌కు బాగా సూటవుతుందనే ఉద్దేశంతోనే మరో చిన్న హీరో నుంచి ఈ టైటిల్‌ను తీసుకున్నారు కాటమరాయుడు దర్శకనిర్మాతలు. ఇలా తన సినిమాల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచే ఫోక్ సాంగ్ ట్రెండ్‌ను తన అప్ కమింగ్ మూవీలోనూ కంటిన్యూ చేయాలని పవర్ స్టార్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.
 folk song in pawan-trivikram film
పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇతర పాటలతో పాటు ఓ ఫోక్ సాంగ్ కోసం మంచి ట్యూన్ రెడీ చేయాలని చిత్ర సంగీత దర్శకుడు అనిరుధ్‌కు సూచించాడట మాటల త్రివిక్రమ్‌. తొలిసారి పవన్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న అనిరుధ్.. ఈ సినిమాలోని ఫోక్ సాంగ్ కోసం ఓ ఫన్నీ ట్యూన్‌ను సిద్ధం చేసిపెట్టాడని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి పవర్‌స్టార్‌ మరో స్పెషల్‌ సాంగ్‌తో ఫ్యాన్స్‌కి పండగ తేబోతున్నాడన్నమాట.

- Advertisement -