ఈటల ముక్కు నేలకు రాయాలి: బాల్క సుమన్

35
balka suman

దళితుల భూములు కబ్జా చేసి ఈటల రాజేందర్ ముక్కును నేలకు రాయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్. టీఆర్ఎస్‌ఎల్పీలో మీడియాతో మాట్లాడిన సుమన్..ఈటల రాజేందర్ భార్యకు చెందిన జమున హచరిస్ పైన మెదక్ కలెక్టర్ మాట్లాడారు..ప్రభుత్వ, ఎస్సి, ఎస్టీ భూములను కబ్జా చేసారని కలెక్టర్ చెప్పారు..ఎస్సి,ఎస్టీల భూములను అడ్డగోలుగా కబ్జా చేశారని తెలిపారు.

నీతి నిజాయితీ ఉంది అంటున్న ఈటల రాజేందర్ 70 ఎకరాల భూములను ఏ విధంగా కబ్జా చేశారని మండిపడ్డారు. కలెక్టర్ ఆధారాలతో సహా చూపించారు..తప్పైందని ఈటల ముక్కు నేలకు రాయాలన్నారు. కబ్జాలు చేసేది వీల్లే, నోరు లేని పేదల భూములను లాక్కుంటారు, పర్యావరనానికి హాని కలిగిస్తారు…మళ్ళీ వీల్లే దొంగే దొంగ అన్నట్టు ప్రవర్తిస్తారని చెప్పారు.

తప్పు అని రుజువైతే ముక్కు నేలకు రాస్తా అన్నాడు ఈటల రాజేందర్..ఇప్పటికైనా హుజురాబాద్ ప్రజలు ఈటల తీరును గమనించాలన్నారు. ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి, పేదల భూములు పేదవారికి ఇవ్వాలని డిమాండ్ చేసిన సుమన్..రాబోయే రోజుల్లో చట్టపరమైన చర్యలు తప్పకుండా ఉంటాయన్నారు,.