మూగబోయిన నేతన్నల మగ్గాలకు మునపటి కళ..

260
Powerloom weavers of sircilla are back to work
- Advertisement -

రాజన్న సిరిసిల్లలో కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో మూగబోయిన నేతన్నల మగ్గాలు, ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు ఇచ్చిన, లాక్ డౌన్ సడలింపులతో మళ్లీ మునపటి కళను సంతరించుకున్నాయి. ఈ కరోనా కాలంలో చానమంది కార్మికులు సంచాలు పట్టాలంటే ఇంకెన్ని నెలల టైం పడుతుందోనని అనుకున్నారు. చేనేత కార్మికుల కుటుంబాలంతా పని ఉంటుందా, ఉండదా అనే డైలమాలో ఉన్నారు.

ఈటైంలో మంత్రి కేటీఆర్ చొరవతో రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో సంచాల సప్పుళ్లు మొదలైయ్యాయి. దాదాపు 45 రోజుల తర్వాత తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులోని టెక్స్ టైల్ పరిశ్రమలు నడుస్తుండగా, ఇప్పుడు సిరిసిల్ల, చంద్రంపేట, తంగళ్లపల్లి గ్రామాల్లో వస్త్రాల ఉత్పత్తులు మొదలైయ్యాయి. ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లు బతుకమ్మ చీరలు, విద్యార్థుల యూనిఫాంలు తయారు చేస్తున్నారు.

ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు పాటిస్తూ… గురువారం నుంచి పూర్తి స్థాయిలో వస్త్ర ఉత్పత్తి చేస్తామని నేతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి కష్టకాలంలో నేతన్నలను ఆదుకునే ప్రయత్నం చేసిన మంత్రి కేటీఆర్‌ను కలిసి ధన్యవాదలు తెలిపారు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్నాటి విద్యాసాగర్.

- Advertisement -