ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియానికి కరెంట్‌ కట్‌..

26
uppal

ఉప్పల్ క్రికెట్ స్టేడియానికి కరెంట్ కట్ చేశారు విద్యుత్ అధికారులు. మూడు కోట్ల ఐదు లక్షల పన్నెండువేల ఏడు వందల తొంభై రూపాయల విద్యుత్ బిల్లు బకాయిపడగా విద్యుత్తు బకాయి బిల్లులు చెల్లించకపోవడంతో  సరఫరా నిలిపివేసినట్లు తెలిపారు విద్యుత్ అధికారులు.

బిల్లులు చెల్లించకుండా కరెంటును యధావిధిగా వాడుకోవడంతో శాఖ అధికారులు హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం(హెచ్‌సీఏ)పై గతంలో విద్యుత్తు చౌర్యం కేసు నమోదు చేశారు. దీంతో హెచ్‌సీఏ కోర్టును ఆశ్రయించింది. కోర్టులో విద్యుత్తు శాఖకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇటీవల అధికారులు బకాయిల విషయమై హెచ్‌సీఏకు నోటీసులు జారీ చేసినా చెల్లించకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారువిద్యుత్ అధికారులు. దీంతో ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ మైదానం చీకటి మయమైంది.