సాధారణంగా పాల గురించి మనందరికి తెలిసిందే. పాలను అత్యంత బలమైన ప్రోటీన్ ప్రదార్థం గా పరిగణిస్తుంటారు. అయితే చాలమంది పాలు తాగడానికి గాని, పాల పదార్థాలు తినడానికి గాని పెద్దగా ఆసక్తి చూపించారు. ఎందుకంటే పాల యొక్క వాసన కారణంగా వాటికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారు పాలకు ప్రత్యామ్నాయంగా లభించే పోషక పదార్థాల కోసం వెతుకుతుంటారు. అలాంటి వారికి ఆలుతో చేసిన పాలు ఒక చక్కటి ప్రత్యామ్నాయంగా ఉంటాయి. పాలలో ఉండే అన్నీ పోషకాలు ఇందులో లభించనప్పటికి దాదాపు పాలతో సమానమైన పోషకాలను ఆలుపాలు అందజేస్తాయి. ఆలుగడ్డ ను బంగాళదుంపగ కూడా పిలుస్తుంటారు..
దీనితో రకరలాల కూరలు వేపుడు చిప్స్ వంటివి తయారు చేస్తుంటారు. కాగా ఆలుతో చేరే కూరలు ఇష్టపడని వారు వాటిని పాల రూపంలో తయారు చేసుకొని సేవించవచ్చు. ఆలుపాలు తయారు చేసుకోవడం కూడా ఎంతో సులభం. పచ్చి బంగాళదుంపలను తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక పాత్రలో వేసి బాగా ఉడికించుకోవాలి. తర్వాత ఆ ముక్కలను మిక్సీలో వేసి నీళ్ళు, బాదం పొడి, ఉప్పు చక్కెర వంటివి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తరువాత వడకట్టుకొని ఆ మిశ్రమాన్ని పాల రూపంలో సేవించవచ్చు. ఆలులో ఉండే ఫైబర్ జీర్ణ శక్తిని మెరుగు పరుస్తుంది. ఇంకా బాదంపొడి వల్ల అదనపు ప్రోటీన్లు మన శరీరానికి అందుతాయి. ఇంకా విటమిన్ డి, ఇ, బి12, ఐరన్, పోలేట్ యాసిడ్ వంటివి కూడా ఈ యొక్క ఆలుపాల వల్ల మన శరీరానికి అందుతాయి. కాబట్టి ఆలుతో చేసే వంటలు నచ్చని వారు ఈ విధంగా ఆలుపాలు తయారు చేసుకొని సేవించవచ్చు.
Also Read:మెగాస్టార్‌కి శుభాకాంక్షల వెల్లువ