శరీరంలో ఇది లోపిస్తే.. అంతే సంగతులు!

45
- Advertisement -

మన శరీరంలో అన్నీ అవయవాలు సక్రమంగా పని చేయాలంటే.. సూక్ష్మ పోషకాలు చాలా అవసరం. శరీరంలో పోషకాలు లోపిస్తే పలు అవయవాల పని తీరు మందగిస్తుంది. తద్వారా ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాగా మన శరీరానికి అవసరం అయ్యే పోషకాలలో పొటాషియం కూడా ఒకటి. ప్రతిరోజూ మనకు 2 గ్రాముల నుంచి 4 గ్రాముల వరకు పొటాషియం అవసరమౌతుంది. మన శరీరంలో పొటాషియం లెవెల్స్ తగ్గినప్పుడు ఎన్నో సమస్యలు చుట్టూముడుతాయి. కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, అలసటగా ఉండడం, వంటి సమస్యలతో పాటు జీర్ణ వ్యవస్థ మందగించడం, గ్యాస్, మలబద్దకం వంటివి కూడా దరిచేరుతాయి. .

ఇంకా రక్తంలో పొటాషియం లోపిస్తే గుండె సమస్యలకు కూడా దారితీస్తుంది. అందువల్ల పొటాషియం అవయవాల పనితీరుకు ఎంతో అవసరం. కండరాలను బలంగా తయారు చేయడంలోనూ, నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపరచడంలోనూ పొటాషియం ప్రముఖ పాత్ర వహిస్తుంది. అలాగే గుండె జబ్బులను దూరం చేయడంలోనూ, శక్తిని ఉత్పత్తి చేయడానికి కూడా పొటాషియం అవసరం. అందువల్ల మన శరీరానికి పొటాషియం అందించడంలో నిర్లక్ష్యం వహించరాదు. పొటాషియం అనేది వివిధ రకాల ఆహార పదార్థాలలో పుష్కలంగా లభిస్తుంది. ముఖ్యంగా బీన్స్, ఎండు ద్రాక్ష, తృణదాన్యాలు, పాలు, గ్రుడ్లు,..వంటి వాటిలో పొటాషియం అధికంగా లభిస్తుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -