ఎన్డీఆర్‌ను టచ్‌ చేస్తే.. చెప్పుతో కొడతారు..!

185
posani krishnamurali sensational comment on varma for ntr biopic
- Advertisement -

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ పై బయోపిక్ తీస్తానని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన విషయం తెల్సిందే.

ఎన్టీఆర్ బయోపిక్ ను రూపొందించనున్నానని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించడంపై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. ఒకవేళ వర్మ రూపొందించే సినిమాలో బాలయ్య హీరోగా నటిస్తే దానికి నందమూరి అభిమానుల ఆమోదం లభిస్తోంది. అలా కాదంటే మాత్రం వారి నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.

posani krishnamurali sensational comment on varma for ntr biopic

ఇక ఈ సినిమా ప్రకటనపై స్పందించిన వారిలో సీనియర్ రచయిత, దర్శకుడు, నటుడు అయిన పోసాని కృష్ణమురళి ఉండటం గమనార్హం. ఎన్టీఆర్ జీవిత కథతో సినిమా తీయాలన్న వర్మ ఆలోచననే పోసాని ఖండించారు.

ఎన్టీఆర్ పై సినిమా తీయనక్కర్లేదు.. అని పోసాని అభిప్రాయపడ్డారు. ఏమైనా తేడాలు వస్తే వర్మను ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్పుతో కొడతారు అని పోసాని వ్యాఖ్యానించడం గమనార్హం.

 posani krishnamurali sensational comment on varma for ntr biopic

ఎన్టీఆర్ పేరుతో ఆయనను అవమానించేలా సినిమా తీస్తే ప్రేక్షకులు తెరను చించేస్తారని, వర్మను వెంటాడి కొడతారని అన్నారు. ఈ సినిమా గురించి మీరు వర్మకు సలహాలు, సూచనలు ఇస్తారా? అంటే.. అసలు దీనిపై వర్మతో తనేం మాట్లాడను అని పోసాని వ్యాఖ్యానించారు.

 posani krishnamurali sensational comment on varma for ntr biopic

ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ నటిస్తే బాగుంటుందని, వివాదాస్పదం చేయకపోతే బాగుంటుందని అని లక్ష్మిపార్వతి అభిప్రాయపడ్డారు. వాస్తవాలను వాస్తవాలుగా చూపాలని ఆమె అంటున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు బాలయ్య సరిపోడని కూడా నందమూరి లక్ష్మిపార్వతి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై పోసాని స్పందిస్తూ.. ఆమె అభిప్రాయంపై తను కామెంట్ చేయనని, ఆమె తనకు అక్కలాంటిదన్నారు పోసాని.

- Advertisement -