- Advertisement -
పోప్ ఫ్రాన్సిస్ ఇకలేరు. వాటికన్ సిటీలో ఇవాళ ఉదయం చనిపోయారు. ఆయన వయస్సు 88. వాటికన్ కామెర్లెంగో కార్డినల్ కెవిన్ ఫెర్రెల్ ఈ విషాద వార్తను తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పోప్ ఫ్రాన్సిస్.. ఇవాళ ఉదయం 7:35 గంటలకు రోమ్‌లోని జెమెల్లి ఆసుపత్రిలో కన్నుమూశారు.
1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో జన్మించిన పోప్ ఫ్రాన్సిస్.. 2013 మార్చి 13న 266వ పోప్‌గా ఎన్నికయ్యారు. నిన్న ఈస్టర్ వేడుకల్లో కూడా ఆయన పాల్గొనడం విశేషం. తన 12 ఏళ్ల వయస్సు నుంచే చర్చి, సమాజం, అట్టడుగు వర్గాల కోసం అంకితమై పనిచేశారు.
Also Read:బీఆర్ఎస్ సభ కోసం కూలీ పని!
- Advertisement -

