బాలీవుడ్ హీరోయిన్ పూనమ్ పాండే హాట్ అందాలతో కుర్రకారుకి హీటెక్కిస్తుంది. బట్టలు తక్కువ వాడి ఎక్కువ పాపులారిటీ ఎలా సంపాదించాలో ఈ అమ్మడికి తెలిసినట్టుగా ఇంకెవరికీ తెలియదు. పూనమ్ సినిమాల్లో కనిపించింది తక్కువే అయినా.. వార్తల్లో మాత్రం ఆమె పేరు చాలా తరచుగా కనిపిస్తుంటుంది. జనాల నోళ్లలో తన పేరు వినబడటానికి ఏదో ఒకటి చేస్తుంది. ఏమీ లేకపోతే రెండు న్యూడ్ ఫొటోలతో నెటిజన్లను పిచ్చెక్కించేస్తుంది. అందుకే సోషల్ మీడియాలో ఆమె ఫాలోయర్లకు లోటే ఉండదు.
ఇక తాజాగా పూనమ్ పాండే తన ఫొటోలతో కాకుండా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగులతో మరోసారి హాల్‌చల్ చేస్తోంది. ప్లాస్టిక్ వాడకంపై మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిషేధం విధించింది. ఇకపై ప్లాస్టిక్‌ను విక్రయించినా, ఉపయోగించినా భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా విధించనున్నట్టు ప్రకటించింది. ఇప్పుడీ నిషేధంపై ప్రముఖ నటి, మోడల్ పూనమ్ పాండే సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ నిషేధంలో కండోమ్‌లను కూడా చేర్చారా? అంటూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆరా తీసింది. అంతకుముందు మరో ట్వీట్‌లో.. ‘‘ప్లాస్టిక్ నిషేధం అమల్లో ఉంది.. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న వాళ్లు దయచేసి బయటకు రాకండి’’ అని సెటైరికల్‌గా ట్వీట్ చేసింది.
ఇక ఆమె ట్వీట్లపై నెటిజన్లు కూడా అంతే సెటైరికల్‌గా ట్వీట్ చేస్తూ పూనమ్‌ను ట్రోల్ చేస్తున్నారు. కండోముల గురించి ఆమె అడిగిన ప్రశ్నకు ఓ ట్విట్టర్ యూజర్ బదులిస్తూ.. తొలుత ప్లాస్టిక్‌కు, రబ్బరుకు తేడా తెలుసుకుంటే మంచిదని సూచించాడు. నగ్నత్వ ప్రదర్శన కోసమే ఆమె చదువుకున్నట్టు అనిపిస్తోందని చురక అంటించాడు. మరో యూజర్ ఆమె ఫొటోలను పోస్టు చేసి దుస్తులను కూడా బ్యాన్ చేశారా? అని ప్రశ్నించాడు. మరో యూజర్ అయితే, ‘‘నీ దగ్గరే బోల్డంత ప్లాస్టిక్ ఉంది. జాగ్రత్త’’ అని హెచ్చరించాడు. మొత్తానికి ఓ చిన్న ట్వీట్ చేసిన పూనమ్ పాండేను నెటిజన్లు ఇలా ట్వీట్లేత్తిపోశారు.
Plastic banned ho gya hai…. जिसने जिसने प्लास्टिक सर्जरी की है, वे रास्तेपर ना घुमे। 😨
— Poonam Pandey (@iPoonampandey) June 23, 2018
Just asking..
Is *CONDOM* included in
Plastic banned Items 🤔🤔🤔 #SachhiKya #JustAsking— Poonam Pandey (@iPoonampandey) June 25, 2018