సుప్రీం తీర్పుపై పూనమ్ కౌర్

114
poonam
- Advertisement -

అవివాహిత మహిళల అబార్షన్‌పై సర్వోన్నత న్యాయస్ధానం కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. గ‌ర్భాన్ని తొల‌గించుకునేందుకు మ‌హిళ‌లు వివాహితులై ఉండాల్సిన నియ‌మం ఏమీ లేద‌ని…సుర‌క్షిత‌మైన‌, చ‌ట్ట‌ప‌ర‌మైన అబార్ష‌న్‌కు మ‌హిళ‌లు ఎవ‌రైనా అర్హులే అని వెల్లడించింది. మైన‌ర్లు, రేప్ బాధితులు, గ‌ర్భ స‌మ‌స్య‌లు ఉన్న‌వాళ్లు త‌మ ప్రెగ్నెన్సీని 24 వారాల వ‌ర‌కు ట‌ర్మినేట్ చేసే అవ‌కాశం ఉందని తెలిపింది.

ఈ నేపథ్యంలో నటి పూనమ్ కౌర్ స్పందించారు. గర్భం దాల్చిన త‌ర్వాత‌ పురుషులు తమ రిలేష‌న్ షిప్‌కు కట్టుబడి ఉండమని బలవంతం చేయడం తాను చూశాన‌ని పూన‌మ్ కౌర్‌ చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుకు మద్దతు ఇస్తున్నా…. స్త్రీలు పెళ్లిని, ఆర్థిక భద్రతను కాపాడుకునేందుకు గర్భం దాల్చడం చూశానని అన్నారు.

కానీ ఇక్క‌డ ఒక వ్య‌క్తి తన జీవితమంతా అనేక విధాలుగా బాధపడాల్సి వస్తుందన్నారు. స్త్రీలు తమ పునరుత్పత్తి శక్తిని స్వార్థ ప్రయోజనాల కోసం అవ‌స‌ర‌మయ్యే ఆయుధంగా ఉపయోగించుకోకూడదని సూచించిచారు.

- Advertisement -