నన్ను ఊపిరి తీసుకోనివ్వండి.. నెటిజన్లకు పూన‌మ్ కౌంటర్‌..

71
Poonam Kaur
- Advertisement -

టాలీవుడ్‌ నటి పూనమ్‌ కౌర్‌ సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువగా పాపులార్టీ తెచ్చుకుంది. ఆమె సోషల్ మీడియాలో వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తోంది. పూనమ్ కౌర్ ఎలాంటి విషయం గురించి అయినా తన అభిప్రాయాలు చెబుతుంది.. కానీ పరోక్షంగా మాత్రమే.. అప్పట్లో పూనమ్ కౌర్ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ ఇన్ డైరెక్ట్ గా చేసిన ట్వీట్స్ హాట్ టాపిక్ గా మారాయి. తన కామెంట్స్ తో పూనమ్ కౌర్ రూమర్స్ కి కేంద్ర బిందువుగా నిలిచింది. చాలా విషయాల్లో ఆమె క్లారిటీ మైంటైన్ చేయకుండా అందరిని తికమక పెట్టేది.

దీనితో పూనమ్ సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టినా అభిమానుల్లో చర్చ జరిగేది. ఆమె గురించి న్యూస్ వైరల్ అవుతూ వచ్చింది. ఇటీవల పూనమ్ కౌర్ చేసిన ఓ పోస్ట్ కూడా అలాగే సోషల్ మీడియాలో వైరల్ అయింది. పూనమ్ కౌర్ ఇటీవ‌ల ఇద్ద‌రు పిల్ల‌ల‌తో ఫొటో దిగి పోస్ట్ చేసింది. దీంతో పూన‌మ్ కౌర్‌కి పెళ్లయి పిల్ల‌లు ఉన్నార‌ట అంటూ సామాజిక మాధ్య‌మాల్లో కొంద‌రు పోస్టులు చేశారు.

ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను పోస్ట్ చేసిన పూన‌మ్ కౌర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ‘భరించలేని విధంగా ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన డ్యామేజ్ ఇక చాలు’ అని ఆమె పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో ఉన్న‌ది త‌న స్నేహితుల పిల్ల‌ల‌ని తెలిపింది. దీనిపై స్ప‌ష్టత నిచ్చే అవ‌కాశం ఇచ్చినందుకు సోష‌ల్ మీడియాకు థ్యాంక్స్ అంటూ.. నన్ను కాస్త ఊపిరి తీసుకోనివ్వండి’ అని పూనమ్‌ ట్వీట్‌ చేసింది. దీంతో పుకార్లకు చెక్‌ పెట్టినట్లయ్యింది.

- Advertisement -