పూజా ప్రేమాయణం పై వివరణ

39
- Advertisement -

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తో, పూజా హెగ్డే ప్రేమలో ఉందని, అతనితో ఆమె ఎఫైర్ పెట్టుకుంది అని గత కొంతకాలంగా పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. మరి నిజంగానే పూజా హెగ్డే, సల్మాన్ ఖాన్ ప్రేమలో మునిగిపోయిందా ?, అసలు ఈ వార్తలో ఎంత నిజం ఉంది ?, మొన్నటివరకూ ఓ టాలీవుడ్ దర్శకుడితో కూడా పూజా హెగ్డే ప్రేమలో ఉంది అని వార్తలు రాశారు. ఇప్పుడేమో సల్మాన్ ఖాన్ ప్రేమలో ఉంది అంటూ పుకార్లు అల్లుతున్నారు. ఇంతకీ అసలు నిజం ఏది ? అంటూ నెటిజన్లు మెసేజ్ లు చేస్తున్నారు. ఈ మెసేజ్ లు పూజా హెగ్డే వరకూ వెళ్లినట్టు ఉన్నాయి. అందుకే, తాజాగా తన ప్రేమాయణం పై పూర్తి వివరణ ఇచ్చింది.

తాను సల్మాన్‌ ఖాన్‌తో డేటింగ్ లో ఉన్నట్లు వస్తున్న రూమర్స్‌ పై పూజ హెగ్డే స్పందిస్తూ.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని పూజా హెగ్డే తేల్చి చెప్పింది. పూజా హెగ్డే మాట్లాడుతూ.. ‘సల్మాన్‌తో డేటింగ్‌ చేస్తున్నట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. పూజా హెగ్డే ప్రేమలో ఉంది అంటూ మీడియా వాళ్లు వార్తలు రాస్తూనే ఉన్నారు. కానీ నేను ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నా. ఎవరితోనూ ప్రేమలో లేను. ప్రస్తుతం నా దృష్టంతా కెరీర్‌ పైనే పెట్టాను. ఈ విషయం మీడియా ప్రతినిధులు అర్థం చేసుకోవాలి అంటూ పూజా హెగ్డే చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం పూజా హెగ్డే.. సల్మాన్‌ ఖాన్‌ తో ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే సల్మాన్‌ తో డేటింగ్‌ చేస్తోంది అంటూ టాక్ నడిచింది. ఆ మధ్య ఉమైర్ సందు చేసిన ఓ ట్వీట్ కూడా ఈ టాక్ కి కారణం అయింది. ‘పూజ హేగ్దెకు.. సల్మాన్ సరికొత్త లగ్జరీ కారు గిఫ్ట్ గా అందించాడు అని, ఆమె అంటే అతనికి చాలా ఇష్టం’ అంటూ ఉమైర్ సందు ఓ పోస్ట్ పెట్టాడు. నిప్పు లేకుండా పొగ రాదు కాబట్టి.. ఉమైర్ సందు పోస్ట్ లో నిజం ఉందని అందరూ నమ్మారు. అందుకే పూజా హెగ్డే తాజాగా వివరణ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి…

8A.M.మెట్రో లాంచ్ బై గుల్జార్..

Shobana:రెయిన్‌ సాంగ్‌ అంటే మర్డర్‌తో సమానం..

ప‌వ‌న్ తో అమ్మడు మాస్ సాంగ్

- Advertisement -