హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ స్క్రిప్ట్ మారక ముందే ఈ కాంబో సినిమాలో పూజ హెగ్డే ను హీరోయిన్ గా ఫిక్స్ చేసుకున్నాడు హరీష్, డీజే , వాల్మీకి సినిమాల్లో పూజ ను హీరోయిన్ గా పెట్టుకున్న సెంటిమెంట్ తో మళ్లీ హరీష్ పూజ కే ఛాన్స్ ఇచ్చాడు. పూజ కూడా ఈ ప్రాజెక్ట్ కి డేట్స్ అడ్జస్ట్ చేస్తానంటూ అప్పట్లో మాటిచ్చింది.
ఈ ప్రాజెక్ట్ కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తుంది. తాజా స్క్రిప్ట్ మారింది. ముందు హరీష్ పవన్ కోసం ఓ కాలేజీ లెక్చరర్ స్టోరీ రాసుకున్నాడు. కానీ ఇప్పుడు స్క్రిప్ట్ మారింది. భవదీయుడు భగత్ సింగ్ కాస్త ఉస్తాద్ భగత్ సింగ్ గా టైటిల్ కూడా మారింది. తేరి రీమేక్ గా ఈ సినిమాను చేయబోతున్నాడు హరీష్. తాజా హీరోయిన్ ను కూడా మార్చేశారు. పూజ ప్లేస్ లో ఇప్పుడు శ్రీ లీల ను తీసుకున్నట్టు సమాచారం. అయితే పూజ అప్పట్లో డేట్స్ అడ్జెస్ట్ చేసింది కానీ ఇప్పుడు ఆమె డైరీ బిజీగా ఉంది. అందుకే ఇప్పుడు ఆమె ప్లేస్ లో ధమాకా బ్యూటీ శ్రీ లీలను ఫైనల్ చేసుకున్నాడట హరీష్. త్వరలోనే పవన్ సరసన శ్రీలీల అంటూ ప్రొడక్షన్ నుండి ఎనౌన్స్ వచ్చే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి…