వైన్స్ షాపుల ముందు పూజలు

208
chikkadapalli wines shop
- Advertisement -

లాక్ డౌన్ నేపథ్యంలో కేంద్ర ఇచ్చిన సడలింపు తెలంగాణలో కూడా వర్తిస్తాయని సీఎం కేసీఆర్ తెలిపిన నేపథ్యంలో ఇవాళ ఉదయం నుండే తెలంగాణలోని గ్రీన్ జోన్,ఆరెంజ్ జోన్లలో అన్ని షాపులు తెరుకున్నాయి. ఇక అన్ని జోన్లలో వైన్స్ షాప్ ఓపెన్‌ కాగా మందుబాబులు ఉదయం నుండే వైన్స్ షాపులకు క్యూ కట్టారు.

హైదరాబాద్ చిక్కడపల్లి లో కొత్త సినిమా విడుదల సందర్భంగా చేసే హంగామా మాదిరిగానే వైన్స్ షాప్ కు వచ్చి పూజలు చేసి గుమ్మడికాయ కొట్టి మందు కొనుగోలు చేశారు.

- Advertisement -