సీడ్ గణేశాతో పచ్చదనం..సంతోష్‌పై ప్రశంసల జల్లు

9
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన పర్యావరణ హిత సీడ్ గణేశ ప్రచారంలో భాగంగా ప్రముఖ నటి పూజా హెగ్డే ముంబైలో సీడ్ గణేశుడిని స్వీకరించారు.వేప, చింత వంటి స్థానిక వృక్షాల విత్తనాలను కలిపి సహజ మట్టితో తయారు చేసిన ఈ ప్రతిమలను పూజ అనంతరం ఇంట్లోనే నిమజ్జనం చేయవచ్చు. అప్పుడు విషపూరిత పీఓపీ విగ్రహాల బదులు ఒక మొక్క పెరిగి, భక్తి తో పాటు పచ్చదనం కూడా మిగులుతుంది.

ఈ సందర్భంగా సంతోష్‌కుమార్ ముంబై భక్తులకు పిలుపునిస్తూ, ఈ గణేశోత్సవంలో భక్తిని ప్రకృతి పరిరక్షణతో మేళవించాలని, నీటి వనరులను కలుషితం చేసే రసాయన రంగుల విగ్రహాలను వదిలేయాలని కోరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కుటుంబాలు, సొసైటీలను సీడ్ గణేశ పూజ చేయాలని, మొక్కను పెంచాలని, ఇంకో ముగ్గురిని నామినేట్ చేసి పచ్చని వినాయకుడిని జరుపుకోవాలని విజ్ఞప్తి చే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజ్ఞప్తి చేసింది.

ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు, రచయిత, నిర్మాత సంపత్ నంది గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బృందం నుంచి సీడ్ గణేశా విగ్రహాన్ని అందుకున్నారు.హైదరాబాద్‌లో తన కార్యాలయంలో సీడ్ గణేశా పెట్టెను తెరిచి విగ్రహాన్ని చూసి ఆయన ఆనందం వ్యక్తం చేశారు.సీడ్ గణేశా విగ్రహాలు సహజ మట్టి, కోకోపీట్, కొబ్బరి పొడితో తయారు చేసి, వేప, చింత వంటి స్థానిక వృక్షాల విత్తనాలను పొందుపరుస్తారు. పూజలు పూర్తయిన తర్వాత ఇంట్లోనే మట్టిలో ఉంచితే విత్తనాలు మొలకెత్తి మొక్కలుగా ఎదుగుతాయి. POP విగ్రహాల వల్ల జలాలు కలుషితం కాకుండా భక్తితో పాటు పచ్చదనం కూడా పెరుగుతుంది అన్నారు సంపత్ నంది.

హైదరాబాద్‌లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (GIC) బృందం నుంచి ప్రముఖ తమిళ నటుడు కార్తి కార్తికేయన్ (కార్తి శివకుమార్) పర్యావరణ రహిత విత్తన గణపతి విగ్రహాన్ని స్వీకరించారు. వినాయక చతుర్థి 2026కు ముందు, భక్తితో పాటు పర్యావరణ పరిరక్షణను మేళవించిన ఈ ప్రచార కార్యక్రమానికి ఆయన తన మద్దతును తెలిపారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రచారం చేస్తున్న ఈ విత్తన గణపతి విగ్రహాలను సహజమైన బంకమన్ను, కొబ్బరి పీచు (కోకోపీట్), కొబ్బరి పొడితో తయారు చేస్తారు. వీటిలో వేప, చింత వంటి మన దేశవాళీ వృక్షాల విత్తనాలను నిక్షిప్తం చేస్తారు. పూజ ముగిసిన తర్వాత ఈ విగ్రహాన్ని ఇంట్లోనే నిమజ్జనం చేయవచ్చు. అది మట్టిలో కరిగిపోతున్న కొద్దీ, అందులోని విత్తనాలు మొలకెత్తి చిన్న మొక్కగా ఎదుగుతాయి — తద్వారా ఆ గణనాథుడే స్వయంగా ఒక జీవమున్న మొక్కగా మారి ఆ ఇంటిని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తూ ఉంటాడు.

ఈ విగ్రహాన్ని స్వీకరించిన అనంతరం నటుడు కార్తి, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఈ సత్సంకల్పాన్ని అభినందించారు. పండుగలు దేవతల ఆశీస్సులతో పాటు ప్రకృతి పట్ల బాధ్యతను కూడా గుర్తుచేయాలని వ్యాఖ్యానించారు. చెరువులు, నదులను కలుషితం చేసే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (PoP) మరియు రసాయన రంగుల విగ్రహాలను నివారించాలని, పూజతో పాటు మొక్కలు నాటే కార్యక్రమం ఒకేసారి జరిగేలా ప్రతీ ఒక్కరూ విత్తన గణపతులనే ఎంచుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.

గణేశ్ చతుర్థి 2026 సెప్టెంబర్ 14న ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సీడ్ గణేశా కార్యక్రమాన్ని మెగాస్టార్ చిరంజీవి గారు ప్రారంభించారు. సినీ, రాజకీయ, సామాజిక రంగాల నుంచి పలువురు ఈ సీడ్ గణేశకి మద్దతు తెలుపుతున్నారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 2018లో ప్రారంభమై “మూడు మొక్కలు నాటండి, మూడేళ్లు సంరక్షించండి, మరో ముగ్గురిని నామినేట్ చేయండి” అనే నినాదంతో దేశవ్యాప్తంగా కోట్లాది మొక్కలు నాటింది. సీడ్ గణేశా ద్వారా భక్తి, సాంప్రదాయం,పర్యావరణ పరిరక్షణ ఒక్కటి అవుతాయని GIC బృందం పిలుపునిచ్చింది.

Also Read:వైరల్ చిట్కా..రహాస్యం ఏంటో తెలుసా?

- Advertisement -