ఈ పాత్ర కోసం చాలా ప్రాక్టీస్ చేశాను- పూజా హెగ్డే

60
Pooja Hegde

హీరోయిన్ పూజా హెగ్డే తెలుగు,తమిళ, హిందీ సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఈ అమ్మడు ప్రస్తుతం అఖిల్ అక్కినేని సరసన ‘మోస్ట్ ఎలిజిబుల్ బాచ్‌లర్’ సినిమాలో నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాస్, వాసు వర్మ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇందులో పూజా పాత్ర చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందట.

ఈ సినిమాలో ఆమె పాత్ర గురించి తెలిపింది. స్టాండప్‌ కామెడీ పాత్ర పోషించానని.. ఈ పాత్ర కోసం చాలా ప్రాక్టీస్ చేశానని పూజా అన్నారు. స్టాండప్‌ కామెడీ ఈజీ అనుకున్నా అది చేస్తేగానీ తెలీదు ఎంత కష్టంగా ఉంటుందో.. అని తెలిపారు పూజా హెగ్డే.స్టాండప్ కమెడియన్‌గా కనిపించనున్నట్లు తెలిపిన ఆమె ఇప్పటి వరకు చేసిన వాటికి పూర్తి భిన్నమైన పాత్ర కావడంతో చాలా శ్రమించానని తెలిపింది.

పంచ్ డైలాగులతో ఆకట్టుకోవాలి..ఎంత అవసరమో అంతే స్టాండప్ కామెడి స్కిల్స్ చూపించాలి. ఇందుకోసం బాగా హోం వర్క్ చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ సరసన పీరియాడికల్ రొమాంటిక్ సినిమా ‘రాధే శ్యామ్’, ‘ఆచార్య’లో చరణ్‌కు జంటగా నటిస్తోంది.ఈ చిత్రం జూన్‌ 19న విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా విడుదల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.