రంగస్థలం సినిమాలో జిగేలు రాణీ అనే ఐటెం సాంగ్‌తో కుర్రకారును ఓ రీతిలో ఆకట్టుకున్న నటీ పూజా హెగ్డే. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో వరుస ఆపర్లతో జోరును పేంచుకుంటోంది. టాలీవుడ్‌లో అగ్రహీరోలతో వచ్చే చాన్సులను అందిపుచ్చుకుంటోంది ఈ నటి. సోషల్ మీడియాలో సినిమాల్లో బికిని ప్రదర్శనపై తనపై వచ్చే విమర్శలకు దీటైన సమాధానంతో జావాబిచ్చింది ఈ సుందరి.
సోషల్ మీడియాలో కొందరు ఆమె ధరించే బికిని విషయంలో అభ్యంతరకరమైన కామెంట్లపై మండిపడింది పూజా హెగ్డే. తనదైన శైలీలొ సమాధానమిస్తూ విమర్శకుల నోళ్లు మూసేలా స్పందించింది. అర్థంలేని మాటల్ని అమ్మాయిలు అస్సలు పట్టించుకోవద్దు, మీ మనఃసాక్షి ప్రకారం ఏది చేయాలనిపిస్తే అదె చేయండి. సందర్భానుసారంగా బికినీ ధరించడంలో ఎలాంటి తప్పులేదు. అందుకు గర్వంగా ఫీలవ్వండి. విమర్శలకు భయపడి జీవితంలో రాజీ పడకకూడదు. మనల్ని మనం అమితంగా ప్రేమించుకోవడం అనేది నా దృష్టిలో పెద్ద విప్లవంగా భావిస్తాను అని ఘాటుగా స్పందించింది. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సాక్ష్యం సినిమలో హీరోయిన్‌గా నటిస్తుంది. వచ్చే నెల ఈ సినిమా విడుదలకానుంది.