మోడీకి సలహా ఇచ్చిన పూజ హెగ్డే

294
- Advertisement -

ఫేస్‌బుక్‌ , ట్విటర్‌, న్యూస్‌ పేపర్‌ ఏది చూసినా ఎవరితో మాట్లాడుకుంటున్నా పెద్ద నోట్లు రద్దు వ్యవహారం గురించే. మనదేశంలోని ప్రతీ ఒక్కరి మీదా ఏదో ఒకస్థాయిలో ఈ విషయం అత్యంత తీవ్రమైన ప్రభావాన్ని చూపెడుతోంది. పెద్ద నోట్లకు చెక్ పెట్టేలనే లక్ష్యంగా చేపట్టిన ఈ చర్య పై ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి ఇప్పటికే సెలబ్రెటీలు ట్విట్టర్‌ ద్వారా తమ సపోర్ట్ ఇస్తున్నారు. బడా బాబులు మాత్రం తమ దగ్గర ఉన్న బాక్ట్‌ మనీ ని వైట్‌మనీ ఎలా చేయాలనీ ఇంకా ఆలోచిస్తునే ఉన్నారు.

ఈ పరిస్థితులు ఇలా ఉండగా పూజ హెగ్డే ఏకంగా ప్రధాన మంత్రి మోడికి ఒక సలహాను తన ట్విటర్ లో ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. నరేంద్ర మోడీ గారు ఒకవేళ 500-1000 రూపాయల నోట్లను 2017 మార్చ్ 31వరకూ ప్రభుత్వ ఆసుపత్రులు డొనేషన్లుగా స్వీకరించే ఏర్పాటు ఉంటే నల్లధనం ఓ మంచి పనికి ఉపయోగపడినట్లు అవుతుంది. రద్దు కారణంగా చెల్లకుండా పోయే నల్లధనం ఇలా ఉపయోగపడుతుంది కదా. ప్రజలు డొనేట్ చేస్తే ఆరోగ్య రంగం కూడ పెరుగుతుంది. కేవలం ఒక సలహా మాత్రమే అంటూ ట్వీట్ చేసింది పూజా హెగ్డే. ఈమె అభిప్రాయం ప్రకారం బ్లాక్ మొత్తాన్ని విరాళాలుగా స్వీకరించే ఆప్షన్ ఉండాలి.

 pooja hegde pm suggestion on black money

మరి సలహా బాగున్నా ఈ సూచనను మన ప్రధానమంత్రి స్వీకరిస్తారా అన్నదే ప్రశ్న. ఇది ఇలా ఉండగా పెద్దనోట్ల రద్దు వ్యహారం ఎప్పుడు లేని విధంగా ఈ నోట్ల రద్దు దేశంలో ఎప్పుడూ చూడని వింత పరిమాణాలకు దారితీస్తోంది. పెద్ద మొత్తంలో బాకీలు పడ్డవాళ్లు ఉన్నట్లుండి అప్పు తీర్చేస్తున్నారు. ఓ వైపు వ్యాపారులు పెద్ద మొత్తంలో డబ్బులు పంచుతున్నారు కానీ కేంద్రానికి ట్యాక్స్ కట్టేందుకు ముందుకు రావడం లేదు అంటే ఈ బ్లాక్ మనీ ఏ స్థాయిలో మనదేశంలో పాతుకు పోయిందో అర్ధం అవుతుంది.

కేవలం గడిచిన రెండు రోజుల్లో ఏకంగా అరవై వేలకోట్ల డిపాజిట్లు బ్యాంక్ లోకి వచ్చి పడ్డాయి అంటే మనదేశంలో కొంత మంది దగ్గర ఏస్థాయిలో డబ్బు ఉందో అర్ధం అవుతుంది..

- Advertisement -