పూర్‌ గర్ల్‌గా మారనున్న పూజా హెగ్డే..

233
- Advertisement -

ఒక లైలా సినిమాతో టాలీవుడ్‌లో తళుక్కున మెరిసిన అందాల భామ పూజా హెగ్డే. ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోస్ సరసన ఆఫర్స్ అందుకొని మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్‌గా మారింది. రామ్ చరణ్ రంగస్థలం చిత్రంలో ఐటెం సాంగ్ చేసిన పూజా, ఎన్టీఆర్- త్రివిక్రమ్ సినిమాలో కథానాయికగా కనిపించింది. ప్రస్తుతం మహేష్- వంశీపైడిపల్లి చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. అంతేకాదు జిల్ మూవీ దర్శకుడు రాధాకృష్ణ కుమార్- ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రంలోను ఈ హాట్ బ్యూటీనే కథానాయికగా కనిపించనుంది.

Pooja Hegde

ఇటీవలే ఈ సినిమా ఒక షెడ్యూల్ షూటింగును పూర్తిచేసుకుంది. ఈ సినిమా 1960 కాలంనాటి ప్రేమకథగా రూపొందుతుందనీ, శ్రీమంతుడి పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడనే వార్త ఇటీవలే బయటికి వచ్చింది. ఈ సినిమాలో పూజా హెగ్డే పేదింటి అమ్మాయిగా కనిపించనుందనేది తాజా సమాచారం. ఈ పేదింటి అమ్మాయి ప్రేమలో అంతటి శ్రీమంతుడు ఎలా పడతాడు? అందుకు దారితీసిన పరిస్థితులు ఏమిటి? అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుందట.

అనూహ్యమైన మలుపులతో కొనసాగుతూ ఈ కథ కట్టి పడేస్తుందని అంటున్నారు. యూత్,మాస్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చే విధంగా ఈ సినిమా తెరకెక్కనుందట. ఈ మూవీని తెలుగుతో పాటు తమిళ .. మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -