Pooja Hegde:పూజా హెగ్దే ప్రేమ పురాణం మళ్లీ వైరల్

44
- Advertisement -

కొంతకాలంగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, పూజా హెగ్దే డేటింగ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఉమైర్ సందు చేసిన ఓ ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. ‘పూజ హేగ్దెకు.. సల్మాన్ సరికొత్త లగ్జరీ కారు గిఫ్ట్ గా అందించాడు. ఆమె అంటే అతనికి చాలా ఇష్టం’ అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. మరి నిజంగానే పూజా హెగ్దే, సల్మాన్ ఖాన్ ప్రేమలో మునిగి నానిపోతుందా ?, మరి ఈ వార్త నిజం అయితే.. ఓ టాలీవుడ్ దర్శకుడు పరిస్థితి ఏంటి ? అంటూ నెటిజన్లు మెసేజ్ లు చేస్తున్నారు.

టాలీవుడ్ లో ఓ స్టార్ డైరెక్టర్ తో పూజా హెగ్దే చాలా సన్నిహితంగా ఉంటుంది అంటూ ఎప్పటి నుంచో టాక్ నడుస్తోంది. మరి ఈ నేపథ్యంలో పూజా హెగ్దే సల్మాన్ ఖాన్ తో కూడా ప్రేమ పురాణం నడుపుతుంది అని వార్తలు రావడం హాట్ టాపిక్ అయ్యింది. సల్లూ భాయ్ తో తాను పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరగుతున్న సంగతి తనకు తెలుసు అని ఆ మధ్య పూజా హెగ్దే ఓపెన్ అయ్యింది.

సల్మాన్ ఖాన్ తో డేటింగ్‌ వార్తలపై స్పందించమని ఓ విలేఖరి పూజా హెగ్దేని కోరగా ‘మీకే ఒక అభిప్రాయం ఉంది. ఇంక నేనేమి చెబుతా. ఒకవేళ నేను ఏం చెప్పినా మీకు నచ్చిన విధంగా ఊహించుకుంటారు’ అని పూజా హెగ్దే బదులిచ్చింది తప్ప అసలు విషయం చెప్పలేదు. మొత్తమ్మీద పూజా హెగ్దే ఒక్కో ఇండస్ట్రీలో ఒక్కొకర్ని పట్టుకుంటుంది అని, ఆమెకు సినిమా ఇండస్ట్రీలో ఎలా ఎదగాలో చాలా బాగా తెలుసు అని ఆమె గురించి తెలిసిన వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -