యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్నవిషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఎన్టీఆర్ ‘జైలవకుశ’ సినిమా గ్యాప్ తర్వాత త్రివిక్రమ్‌తో చేస్తున్నాడు. త్రివిక్రమ్ ఈ మూవీ కోసం ప్రత్యేకమైన శ్రద్ద తీసుకుంటున్నాడట.
గతంలో పవన్ కల్యాణ్‌తో త్రివిక్రమ్ ‘అజ్ఞాతవాసి’ సినిమా చేశాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడటంతో కాస్త జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రం రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో వస్తుండటంతో అంచనాలు తారా స్థాయికి చేరాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను ఎంపిక చేసుకున్నారు చిత్ర యూనిట్.
ఇక నేటి నుంచి జరిగే షూటింగ్‌లో పూజా హేగ్డే పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ అమ్మడు ‘రంగస్థలం’ సినిమాలో ఐటెమ్ సాంగ్‌తో అదరగొట్టిన విషయం తెలిసందే. ఈ సినిమా టైటిల్ విషయంలో అనేక వార్తలు ఊపందుకున్నాయి. తాజాగా ‘అసామాన్యుడు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట చిత్ర బృందం. త్రివిక్రమ్ టైటిల్ ఎంపిక చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. గతంలో పవన్ సినిమా టైటిల్ విషయంలో అనేక వార్తలు చక్కర్లు కొట్టడంతో చివరికి ‘అజ్ఞాతవాసి’ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. త్రివిక్రమ్ తారక్ కలయిలో వస్తున్న ఈ మూవీని హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.