పూజా హెగ్డే 7 కోట్లు అడుగుతుంది

45
- Advertisement -

బాలీవుడ్ మీద పొడుగుకాళ్ళ సుందరి పూజా హెగ్డే గ‌ట్టిగా కాన్స‌న్ ట్రేట్ చేస్తోంది. హిందీ సినిమాల కోసం సౌత్ సినిమాలను కూడా పక్కన పెడుతుంది. కారణం ఒక్కటే.. సౌత్ తో పోలిస్తే బాలీవుడ్ లో హీరోయిన్ల పారితోషికాలు చాలా ఎక్కువ‌. పైగా స్థాయి పెరిగినట్టే. పాన్ ఇండియా హీరోయిన్ గా కూడా చలామణి అవ్వొచ్చు. దీంతో బాలీవుడ్ అవ‌కాశాలు వ‌స్తే కాద‌నే సౌత్ హీరోయిన్లు ఎవ్వరూ ఉండరు. అందుకేనేమో కెరీర్ లో ఏదో ఒక ద‌శ‌లో అయినా బాలీవుడ్ లో మెయిన్ హీరోయిన్ గా న‌టించాల‌ని పూజా హెగ్డే, రకుల్, ఇలియానా లాంటి హీరోయిన్లు ఆశ పడుతుంటారు. కాకపోతే పూజా హెగ్డే లాంటి హీరోయిన్ కే ఆ ఆశ తీరుతుంది. ఇప్ప‌టికే బాలీవుడ్ అవ‌కాశాల‌ను ఒడిసిప‌డుతోంది పూజా హెగ్డే.

పూజా హెగ్డే చేతిలో మూడు బాలీవుడ్ ప్రాజెక్టులున్నాయి. వాటికి తోడు మహేష్ – త్రివిక్రమ్ సినిమాతో కూడా హిందీ బెల్ట్ లో అలరించబోతుంది. ఆల్ రెడీ పూజా హెగ్డేకి హిందీలో బ్ర‌హ్మాండ‌మైన గుర్తింపు ఉంది. మరోపక్క పూజా హెగ్డే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ దిశ‌గా సాగిపోతుంది. ప్ర‌స్తుతం చేస్తున్న రెండు సినిమాల‌కు తోడు.. బాలీవుడ్ లో పూజా హెగ్డే కు మ‌రో అవ‌కాశం ల‌భించింద‌ని తెలుస్తోంది. ఈ సారి షాహిద్ కపూర్ తో పూజా హెగ్డే జ‌త క‌డుతోంద‌ట‌.

ఇలా వ‌ర‌స పెట్టి బాలీవుడ్ అవ‌కాశాలను అందుకుంటుంది పూజా హెగ్డే. అందుకే తన రెమ్యూనిరేష‌న్ ను సైతం అమాంతం పెంచేసింది. మామూలుగానే బాలీవుడ్ హీరోయిన్లు 9 నుంచి 10 కోట్ల రూపాయ‌ల రెమ్యూనిరేష‌న్ ను అందుకుంటూ ఉంటారు. అందుకే.. పూజా హెగ్డే ఒక్కో బాలీవుడ్ సినిమాకు 7 కోట్లు డిమాండ్ చేస్తోందట. సౌత్ లో 4 కోట్ల రూపాయ‌లు గ‌రిష్ట స్థాయి. పూజా హెగ్డే కూడా సౌత్ లో 3 కోట్లే తీసుకుంది. కానీ హిందీలో ఏకంగా 7 కోట్లు అందుకుంటుంది.

ఇవి కూడా చదవండి…

రాశీఖన్నా క్రష్‌ ఎవరో తెలుసా?

మహేష్ సినిమా పై క్రేజీ అప్‌డేట్

ఇన్ స్టాగ్రామ్ కే వేడెక్కిస్తోంది.. కానీ?

- Advertisement -