సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈసినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. హైదరాబాద్ లోని రామోజీ ఫిలీం సిటిలో ఈమూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సెప్టెంబర్ 13 వ తేదీతో కొండారెడ్డి బురుజుకు సంబంధించిన షెడ్యూల్ పూర్తవుతుంది. ఈ షెడ్యూల్ తరువాత మిగతా మిగతా షూటింగ్ ను వీలైనంత త్వరలోనే పూర్తి చేయాలని అనుకుంటున్నారు.
నవంబర్ వరకు షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని భావిస్తున్నారు చిత్రయూనిట్. ఈమూవీలో మహేశ్ ఎంట్రీ సాంగ్ కోసం మొదట మీనాక్షి దీక్షిత్ ను తీసుకోవాలని అనుకున్నా అమె కరెక్ట్ కాదని తమన్నా వైపు మెగ్గుచూపారట దర్శకుడు అనిల్ రావిపూడి. తాజాగా ఉన్న సమాచారం ప్రకారం తమన్నా కూడా ఈ ఆఫర్ ను తిరస్కరించడంతో పూజా హెగ్డె ఓకే చెప్పేసిందని తెలుస్తుంది.
ఇందుకు సంబంధించి పూజా హెగ్డె అగ్రిమెంట్ కూడా చేసుకుందని తెలుస్తుంది. పూజా హెగ్డె త్వరలోనే షూటింగ్ లో పాల్గోననుందని సమాచారం. పూజా హెగ్డె మహేశ్ బాబుతో మహర్షి మూవీలో నటించిన సంగతి తెలిసిందే. ఈమూవీలో మహేశ్ సరసన రష్మీక మందన హీరోయిన్ గా నటిస్తుంది. విజయశాంతి, బండ్ల గణేశ్ ఈమూవీలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమాను 2020సంక్రాంతికి విడుదల చేయనున్నారు.