అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ .. బాక్సాఫీసు కలెక్షన్లలో సల్మాన్ ఖాన్ నటించిన ట్యూబ్‌లైట్‌ని దాటిపోయింది. సినిమాపై టాక్ ఎలా ఉన్నా, అల్లు అర్జున్ నటన పరంగా ఇరగదీశాడని చెబుతున్నారు. ఈ సినిమాలో మరొక ప్లస్ అంటే.. పూజా హెగ్డేనే అని చెప్పుకోవాలి. ఎంత చూపించింది. అల్లు అర్జున్‌తో పోటీపడి ఎంతలా డ్యాన్సులు చేసింది. ఈవిషయంలో పూజాను మెచ్చుకోవాల్పిందే. అయితే ఈ అమ్మడికి నటన పెద్దగా రాదనే విషయం ఇంతకు ముందు ఆమె చేసిన సినిమాలు చూస్తే తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే.. పూజా అందాల వర్ణన మాత్రం అద్దిరిపోయింది. హరీశ్ శంకర్ ఆమె గ్లామర్ ను ఒక రేంజులో చూపించాడు.
అంతేకాదు నటన రాకపోతే.. గ్లామర్ మంత్రం జపించడం తప్పు కాదన్న విషయం ఇంత త్వరగా పూజా నేర్చేసుకొంటుందని ఎవ్వరూ ఊహించలేదు. డీజేలో పూజాని చూసి అంతా షాక్ తిన్నారు. బికినీ సీన్లో అయితే… నోరెళ్ల బెట్టేశారు. అది చూసి సెన్సార్ వాళ్లు కూడా బ్లర్లు వేసుకోవాల్సివచ్చిందంటే ఎంత రేంజ్లో చూపించిందో అర్థమవుతుంది. మొదటి సినిమా ముకుందలో డీసెంట్‌గా కనిపించి పర్లేదనిపించింది. రెండో సినిమా నాగచైతన్యతో ఒక లైలా కోసం సినిమాలో కూడా ఫర్వాలేదనిపించింది. ఇక డీజేలో మూడో సినిమాలో పూజా రెచ్చిపోయింది. ముఖ్యంగా ఆమె బికినీ సీన్ మరియు రెండు పాటల్లో గ్లామర్ ఆరబోత అదిరిపోయింది. బన్నీకి ముద్దులు పెట్టే సీన్లలో కూడా అమ్మడు తెగ ఊరించేసింది..
సినిమాకే ఇంత హాట్ హాట్‌గా రెచ్చిపోవడమేంటని అడిగితే దిమ్మతిరిగే ఆన్సర్ ఒకటిచ్చింది. డీజే కథలో, ఆ సీన్.. బికినీ డిమాండ్ చేసింది. కథానాయకుడు షాక్ అయ్యేలా చేయాలంటే.. కథానాయిక ఆ సమయంలో అంత హాట్ గా కనిపించాల్సిందే. సీన్ డిమాండ్ చేసింది కాబట్టి బికినీ వేశా. ఆ సీన్లో బికినీ వేయకపోతేనే తప్పు.. అంటూ తెలివిగా సమాధానం చెబుతోంది. సెన్సార్ వాళ్లు కూడా బ్లర్లు వేశారు తెలిసిందా? అని అడిగితే… ”అవును.. ఈ సినిమాని నేను థియేటర్లో చూశా. కాకపోతే సెన్సార్ వాళ్లు కట్ చేస్తారనో, బ్లర్లు వేస్తారనో కూర్చుంటే ఏం చేయలేం. బికినీ అనేది గ్లామర్‌లో ఓ భాగం. అందులో నాకైతే ఏ తప్పు కనిపించడం లేదు” అనేసింది. నటన మాటెలా ఉన్నా.. తన అందచందాలతో డీజేలో అదరగొట్టేసిన పూజా.. సభ్య సమాజానికి ఏం మెస్సేజ్ ఇస్తున్నట్టో మరీ..