దిల్ రాజు చేతికి పొన్నియిన్ సెల్వన్!

95
Ponniyen selvan rights for DIl Raju
- Advertisement -

మణిరత్నం స్వీయ దర్శకత్వంలో చియాన్ విక్ర‌మ్‌, కార్తి, జయం రవి, ఐశ్వ‌ర్య‌రాయ్‌, త్రిష, బాబీ సింహా వంటి స్టార్లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం పొన్నియిన్ సెల్వన్. రెండు పార్టులుగా తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ సెప్టెంబ‌ర్ 30న విడుద‌ల కానుంది. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌తో కలిసి మ‌ద్రాస్ టాకీస్ బ్యాన‌ర్‌పై మ‌ణిర‌త్నం స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కించగా తమిళంతో పాటు తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో ఈ చిత్రం విడుద‌ల కానుంది.

ఈ సినిమా తెలుగు థియేట్రిక‌ల్ హ‌క్కుల‌ను స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు ద‌క్కించుకున్నాడు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని తెలుగులో దిల్‌రాజు విడుద‌ల చేస్తున్నాడు. చియాన్ విక్ర‌మ్‌, కార్తి, జయం రవి, ఐశ్వ‌ర్య‌రాయ్‌, త్రిష, బాబీ సింహా వంటి స్టార్లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా తెర‌కెక్క‌నుంది.

- Advertisement -