పీఎస్‌-1ను భారీ ధరకు కొనుగోలు చేసిన ప్రముఖ ఓటీటీ సంస్థ

90
ponniyan
- Advertisement -

ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియన్‌ సెల్వన్‌ నవల ఆధారంగా మణిరత్నం తెరకెక్కిన చిత్రం పొన్నియన్‌ సెల్వన్‌-1. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం భారీ అంచనాల నడమ మొదటి భాగం సెప్టెంబర్‌30న విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు పాటలు సినిమాపై మంచి అంచనాలను క్రియేట్‌ చేసింది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ ఆ అంచనాలను పెంచింది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.

పొన్నియ‌న్ సెల్వ‌న్‌ చిత్రానికి సంబంధించిన డిజిట‌ల్ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసిందట‌. కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం పొన్నియ‌న్ సెల్వ‌న్ రెండు పార్ట్‌ల‌కు క‌లిపి ప్రైమ్ వీడియో సంస్థ సుమారు రూ.125 కోట్లకు కొనుగోలు చేసిందట‌. ఇంకా మొద‌టి భాగం విడుద‌ల కాకముందే ఈ స్థాయిలో డిజిట‌ల్ హ‌క్కులు అమ్ముడ‌య్యాయంటే విశేషం అనే చెప్పాలి. ఇక ఇప్ప‌టికే ఈ సినిమా ఆడియో హ‌క్కులు రూ.20 కోట్లకు అమ్ముడ‌య్యాయి.

లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌తో కలిసి మ‌ద్రాస్ టాకీస్ బ్యాన‌ర్‌పై మ‌ణిర‌త్నం స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కించారు. ఈ సినిమాలో చియాన్ విక్ర‌మ్‌, కార్తి, జయం రవి, ఐశ్వ‌ర్య‌రాయ్‌, త్రిష, బాబీ సింహా వంటి స్టార్లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రానికి స్వ‌ర మాంత్రికుడు ఏ.ఆర్ రెహ‌మాన్ సంగీతం అందించాడు. తమిళంతో పాటు తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో ఈ చిత్రం విడుద‌ల కానుంది.

- Advertisement -