Ponnam:పదేళ్లలో బీజేపీ చేసింది శూన్యం

13
- Advertisement -

పదేళ్లలో బీజేపీ చేసింది శూన్యం అని మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రసంగాల్ని ముక్కలుముక్కలుగా చేసి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని దుయ్యబట్టారు. దేశంలో మొదటి దశ పోలింగ్ తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన స్థాయిని దిగజార్చుకున్నారని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ప్రజల ఆస్తులు ముస్లింలకు ఇస్తారని, అర్బన్ టెర్రిరిజం వస్తుందని, చెప్పడం హాస్యాస్పదం అన్నారు. పదేళ్లు ఈ దేశాన్ని పాలించిన బీజేపీ.. ప్రజలకు ఏం చేసిందో చెప్పాలన్నారు. బీజేపీ ఇలాంటి కుటిల రాజకీయాలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన కుటుంబం గాంధీ కుటుంబమని తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం ఖాయమని తెలిపారు పొన్నం ప్రభాకర్.

Also Read:బెండకాయ నీటితో ఉపయోగాలు

- Advertisement -