బండి సంజయ్‌ది రాజకీయ డ్రామా:పొన్నం

24
- Advertisement -

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. కొత్త రాజకీయ డ్రామాలకు బండి సంజయ్ తెరలేపారన్నారు. నిన్న ఎన్నికల ప్రచారం సందర్భంగా నేను బండి సంజయ్ ని ప్రశ్నించాను..5 సంవత్సరాల పదవి కాలంలో బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించాను..శ్రీరాముని పేరు మీద ఓట్ల ఆడడం కాదు మీరు నిజంగా నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశానని తెలిపారు.

అయితే తాను ఎన్నడూ ఆనంటువంటి మాటలను రాముడి పట్టుక గురించి అక్షింతల గురించి మాట్లాడి..నా తల్లి జన్మకు సంబంధించిన మాటలు బండి మాట్లాడుతున్నారు.. ఇది ఎంత వరకు సమంజసం సభ్య సమాజాన్ని కొరుతున్న అన్నారు. జన్మనిచ్చిన తల్లి నా తల్లి అయిన..ఇంకా ఎవరి తల్లి అయిన తల్లే..
రాజకీయంగా అడిగిన ప్రశ్న అభివృద్ధికి సంబంధించినది అయితే ..అతడు మాట్లాడిన మాట నా తల్లి జన్మకు సంబందించిన మాట..సమాజం గమనించాలన్నారు.

రాజకీయంగా డ్రామాలు చేస్తూ యాత్ర ని కొనసాగిస్తున్నాడు..అతని యాత్ర కి ప్రచారం రావాలని అడ్డుకున్నట్టు కొత్త డ్రామాలకు తెరలెపారన్నారు. బండి యాత్రను అడ్డుకోవడం లేదని ప్రజా స్వామ్యంలో యాత్ర చేసే హక్కు ఉందన్నారు. మీరు మాట్లాడిన మాటలపై చట్టరిత్య చర్యలు తీసుకోవాలని అంటున్నారు..ప్రజలే మనకు చట్టం ప్రహాస్వామ్యమే మనకు చట్టం..ఈ ప్రజల ముందు నేను అడుగుతున్న..నా తల్లి జన్మ గురించి మాట్లాడుతున్న అతని పట్ల ఒకసారి ఆలోచన చేయాలన్నారు.
భార్య కి మంగళ సూత్రం కడతారు..అటువంటి మంగళ సూత్రం అమ్మి ఎన్నికల్లో గెలిచిన అనే వ్యక్తి బండి సంజయ్ అన్నారు. శ్రీ రాముడు అంటే ఎంత గౌరవం..ఆనాడు ఆయోధ్య రాముడిగా సీతమ్మ కోసం పడ్డ కష్టం తండ్రి మాటకు కట్టుబడి విలువిచ్చి పరిస్థితి గురించి మాట్లాడే వీళ్ళు..నా తల్లి జన్మ గురించి మాట్లాడితే ఎం రాజకీయం అన్నారు.

బీజేపీ కేంద్ర నాయకత్వం ఆలోచించాలని…వాళ్ళని అడుగుతున్న ఇటువంటి నాయకునికి డ్రామాలకు సమర్థిస్తున్నారా..? ఆలోచించాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుని అడుగుతున్న ఈ జిల్లాకి సంబంధించిన బీజేపీ నాయకులను అడుగుతున్న..ఈ నియోజకవర్గానికి సంబంధించి ఐదేళ్లలో మీరేం చేశారు నేను ఎంపీగా ఉన్నప్పుడు నేనేం చేశాను ప్రజలు గమనించాలన్నారు. తల్లి మాట నీ సమాధికి కారణం కాబోతుంది బండి సంజయ్.. జాగ్రత్త అని హెచ్చరించారు.

Also Read:చేపలు తింటే ఆ సమస్యలన్ని దూరం !

- Advertisement -