ప్రజాయుత కార్యక్రమాలు చేస్తున్న ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మీడియాతో మాట్లాడిన పొన్నం.. గత పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తున్నాం అన్నారు. అభ్యర్థులు స్థానిక జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందినవారే ఉంటారు అన్నారు.
అభ్యర్థులు ఎవరున్నా.. టికెట్ ఎవరికి అనేది పార్టీ నిర్ణయిస్తుంది అని తెలిపారు. ప్రజా పాలన ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం అన్నారు. ఆర్టీసీలో 200 కోట్ల ఉచిత ప్రయాణాలకు గాను రూ.6800 కోట్ల ఖర్చును ప్రభుత్వం భరించింది అన్నారు.
200 యూనిట్ల ఉచిత విద్యుత్ ద్వారా లక్షల కుటుంబాలు లబ్ది పొందుతున్నాయి… రైతు భరోసా, రైతు రుణమాఫీ, సన్న వడ్లకు 500 బోనస్, నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందించాం అన్నారు.
Also Read:సిద్ధు జొన్నలగడ్డ…తెలుసు కదా!

