- Advertisement -
తెలంగాణ అసెంబ్లీలో సానుకూలంగా ఉన్న బీజేపీ.. కేంద్రంలో మాత్రం అడ్డుకుంటోందని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉంది కాబట్టి తాము ఆ పార్టీ నేతలను అడుగుతున్నామని చెప్పారు. బీసీ రిజర్వేషన్లపై ఏర్పాటైన రాష్ట్ర మంత్రుల కమిటీ న్యాయకోవిదులతో చర్చించి ముందుకెళుతోందని తెలిపారు.
కమిటీ అనేక అంశాలపై చర్చించిన తర్వాత బలహీన వర్గాలకు న్యాయం చేయాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు. పార్టీ పరంగా రిజర్వేషన్లు అనేది ఊహాగానాలు మాత్రమేనని చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అనుసరించాల్సిన విధానంపై ఢిల్లీలో న్యాయ కోవిదులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించిన విషయం తెలిసిందే.
Also Read:వరద నివారణ చర్యల్లో ప్రభుత్వం విఫలం
- Advertisement -

