బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకోం:పొన్నం

8
- Advertisement -

బీసీ వర్గాలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 9వ షెడ్యూల్ లో బీసీ రిజర్వేషన్లు అసాధ్యమన్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు మరోసారి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధ్యమే.. గతంలో తమిళనాడులో జరిగింది అని తెలిపారు. తెలంగాణకు చెందని బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి.. ఎందుకు రిజర్వేషన్లు అమలు కావో చూస్తాం అన్నారు.

Also Read:త్వరలో #VT15 ఫస్ట్ లుక్

రాష్ట్రాల దగ్గర ప్రామాణికమైన ఎంపెరికల్ డేటా ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు అన్నారు. అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సర్వే చేసి కేబినెట్ ఆమోదం, అసెంబ్లీ ఆమోదం, గవర్నర్ ఆమోదంతో ఢిల్లీకి పంపింది అని చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అంశం అన్నారు.

- Advertisement -