- Advertisement -
వచ్చే జయంతి లోపు వంగరలో పీవీ నరసింహారావు మెమోరియల్ పూర్తి చేస్తాం అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. భారతదేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు తెచ్చి యావత్ ప్రపంచానికే ఆయన మార్గదర్శిగా నిలిచారు అన్నారు.
అలాంటి గొప్ప వ్యక్తిని వ్యక్తిగతంగా కలిసే అవకాశం నాకు అనేకసార్లు దక్కింది అన్నారు. పీవీ నరసింహారావు తీసుకున్న అనేక గొప్ప నిర్ణయాలు భావి తరాలకు ఆదర్శం అన్నారు.
భారతదేశ రాజకీయ చరిత్రలో మేరునగ ధీరుడు.. తెలంగాణ పల్లెలో పుట్టి ఢిల్లీ పీఠాన్ని అధిరోహించిన రాజకీయ దురంధరుడు అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. బహుభాషా కోవిదుడు మన మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు జయంతి సందర్భంగా ఘన నివాళి అన్నారు.
Also Read:TTD:కోదండరామ స్వామి విశేష ఉత్సవాలు
- Advertisement -

