- Advertisement -
లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వదిలేయాలంటూ ఎంతగా ప్రాధేయపడినా కనికరం లేకుండా అఘాయిత్యం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు బాధితురాలు.
కేసులో ప్రధాన నిందితుడైన మోనోజిత్ మిశ్రాను కాళ్లు పట్టుకుని బతిమిలాడినా వదిలిపెట్టలేదని వాపోయింది బాధితురాలు. ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం తృణమూల్ కాంగ్రెస్ ఛత్ర పరిషత్ దక్షిణ కోల్‌కతా జిల్లా యూనిట్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు మోనోజిత్.
పెళ్లి చేసుకోవాలని మోనోజిత్ ప్రతిపాదించగా.. తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటూ యువతి నిరాకరించడం వల్లే దారుణం జరిగిందని తేలింది.కాగా, తాజాగా ఈ కేసులో కాలేజీ సెక్యూరిటీ గార్డును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
Also Read:KCR:పీవీ తెలంగాణ ఠీవీ.. భారతదేశ ఆణిముత్యం
- Advertisement -

