ఫ్యూచర్ సిటీ భ్రమనేనా? :పొన్నాల

7
- Advertisement -

రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఆలోచనతో పని చేస్తోందో అర్థం కావడం లేదు అన్నారు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన పొన్నాల…ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా రాజకీయం చేస్తున్నారు …ప్రభుత్వ ప్రాధాన్యతలు ప్రజలకు ఉపయోగకరంగా లేవు…మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పేరు తో అంచనాలు భారీ గా పెంచి లక్ష కోట్లు దాటించారు …విభజన చట్టం ప్రకారం ఎన్టీపీసీ దగ్గర 2400 మెగావాట్ల విద్యుత్ తెలంగాణ కు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కొత్త ప్రాజెక్టుల స్థాపన ఎందుకు ?..ప్రతిపక్షాల విమర్శలకు విద్యుత్ శాఖ మంత్రి సమాధానం చెప్పకుండా వేరే మంత్రులు జవాబిస్తున్నారు…పవర్ లోడ్ ఫాక్టర్ గురించి తెలియని వాళ్ళు పవర్ గురించి మాట్లాడుతున్నారు అన్నారు.

పీక్ లోడ్ ఫాక్టర్ 5 నుంచి 9 శాతం కూడా లేదు …దీనికి కొత్త ప్లాంట్ల అవసరం ఎందుకు ?…సొమ్మును సంపాదించుకునే ఉద్దేశం తప్ప ఈ ప్రభుత్వ పెద్దలకు రాష్ట్ర అభివృద్ధి ఆలోచన లేదు …అణు విద్యుత్ గురించి ఎపుడైనా ఆలోచించారా ?…శాశ్వత ప్రాతిపదికన ఉపయోగపడే పనుల గురించి ఈ ప్రభుత్వం ఆలోచించడం లేదు…కాలుష్యం పెంచే ప్రాజెక్టులు అవసరమా ?…బ్యాటరీ స్టోరేజ్ పవర్ ఏ పరిస్థితుల్లో వాడుకోవాలో ఈ ప్రభుత్వానికి తెలియదు …తుమ్మిడి హట్టి నుంచి సుందిళ్ల కు నీళ్ళు ఎత్తి పోసి అటు నుంచి ఎల్లంపల్లి కి నీళ్లు తరలించడం గురించి సాగునీటి శాఖ మంత్రి మాట్లాడుతున్నారు …అసలు ఉన్న ఎల్లంపల్లి నుంచి ఎన్ని నీళ్లు ఎత్తిపోశారో మంత్రి చెప్పగలరా ?…ఎల్లం పల్లి నుంచి వృధా గా సముద్రం లో కలుస్తున్న నీళ్ల సంగతి ఏంటీ ?…తుమ్మిడి హట్టి సుందిళ్ల పేరుతో 9 నుంచి పన్నెండు వేల కోట్లు వృధా చేస్తున్నారు …హిల్ట్ పాలసి పేరుతో మరో భూ దోపిడీ యత్నం చేస్తున్నారు అన్నారు.

ఇది హిల్ట్ పాలసి కాదు టిల్ట్ పాలసీ …హిల్ట్ భావమేమి రేవంతా ?అని అందరూ అనుకుంటున్నారు …ఫ్యూచర్ సిటీ పేరు తో ప్రజలను భ్రమింప జేస్తున్నారు…పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఉండగా కొడంగల్ ఎత్తిపోతల పథకం దేనికి ?…కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న వాటిని అమలు చేయకుండా లేని వాటికి ప్రాధాన్యత ఏమిటీ ?డబ్బుల సంపాదన కోసం కాదా ?…నాలుగేండ్లలో 24 లక్షల ఇండ్లు కడతామన్నారు .ఇప్పటి వరకు ఎన్ని ఇండ్లు కట్టారు ?విడుదల చేసిన మొత్తం ఎంత ?…రైతు బంధు కోసం శాటిలైట్ ఇమేజి లను వాడుకుంటారట…రైతుల అకౌంట్లలో డబ్బులు వేస్తే కమిషన్లు రావని కోతలు పెట్టే ఆలోచన చేస్తున్నారు…నేను లేవనెత్తిన అంశాలతో విభేదించిన వారెవ్వరితోనైనా చర్చకు సిద్ధం అన్నారు.

త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకోబోతోంది అన్నారు కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి .దేవీప్రసాద్. ఏ వర్గం ఈ రెండేళ్లలో సంతృప్తిగా లేదు …హామీల అమలు ను గాలికొదిలారు …రెండేళ్లలో కే టీ ఆర్ నాయకత్వం లో బీ ఆర్ ఎస్ ప్రధాన ప్రతిపక్ష పాత్రను సమర్ధంగా పోషించింది …తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ 2009 నవంబర్ 29 న దీక్ష ప్రారంభించారు …కేసీఆర్ దీక్షకు కేంద్రం తలవంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది …నాడు తెలంగాణ కు అడ్డుపడ్డ శక్తులే నేడు కేసీఆర్ ను బీ ఆర్ ఎస్ ను బద్నామ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి …తెలంగాణ అస్థిత్వం పై దాడి పెరుగుతోంది …రేపు జరిగే దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ వ్యతిరేక శక్తుల నుంచి తెలంగాణ ను రక్షించుకునే ప్రతిన బూనుతాము అన్నారు.

Also Read:న్యాయస్థానం ఉత్తర్వులపై గౌరవం లేదా?

- Advertisement -